SA vs ZIM : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ విజేత దక్షిణాఫ్రికా (South Africa) కొత్త సీజన్లోనూ రఫ్ఫాడిస్తోంది. లార్డ్స్‌లో బలమైన ఆస్ట్రేలియాకు ముకుతాడు వేసిన సఫారీలు.. ఇప్పుడు జింబాబ్వే (Zimbabwe) భరతం పడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో కొండంత స్కోర్ కొట్టిన ఆ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో తక్కువకే ఆలౌటైనా బులయావో టెస్టులో పట్టుబిగించింది. వియాన్ మల్డర్ (147) శతకంతో, కెప్టెన్ కేశవ్ మహరాజ్(51) హాఫ్ సెంచరీతో చెలరేగగా ప్రత్యర్థికి 537 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. విజయం దిశగా సాగుతోంది.
డబ్ల్యూటీసీ ఛాంపియన్‌గా తొలి టెస్టు సిరీస్‌లో దక్షిణాఫ్రికా గెలుపు దిశగా సాగుతోంది. ఆతిథ్య జింబాబ్వేను హడలెత్తిస్తూ సిరీస్‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది. బులయావోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో సఫారీ బ్యాటర్ల జోరు చూపించారు. తొలి ఇన్నింగ్స్‌లో19 ఏళ్ల కుర్రాడు లుహాన్ డ్రే ప్రిటోరియస్(153), ఆల్‌రౌండర్ కార్బిన్ బాస్చ్(100)లు సెంచరీలతో వీరవిహారం చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో వియాన్ మల్డర్(147) మూడంకెల స్కోర్‌తో రెచ్చిపోయాడు.
🚨 Change of Innings 🚨
The final wicket of Maphaka has fallen, and the Proteas Men are all out for 369, setting a towering lead of 536 runs 🇿🇦🔥
A batting display of sheer dominance and intent from South Africa, putting themselves in full command of this Test match! 💪🏏… pic.twitter.com/nJlwpRxxFV
— Proteas Men (@ProteasMenCSA) June 30, 2025
టాపార్డర్ విఫలమైనా సాధికారిక బ్యాటింగ్‌తో అలరించిన మల్డర్ జట్టు భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. అయితే.. వెల్లింగ్టన్ మసకజ్జ(98-4) ధాటికి లోయర్ మిడిలార్డర్, టెయిలెండర్లు డగౌట్ చేరిన వేళ కేశవ్ మహరాజ్(51) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి సఫారీ జట్టు స్కోర్ 350 దాటించాడు. దాంతో, మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 369 పరుగులు చేసి.. ప్రత్యర్థికి కష్టసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్‌లో సీన్ విలియమ్స్(137) సెంచరీతో 251 రన్స్ చేసిన జింబాబ్వే మ్యాచ్‌ను కాపాడుకోవాలంటే.. అద్భుతం జరగాల్సిందే.