Sourav Ganguly | ఆ ఇద్దరితో ఐసీసీ ట్రోఫీ కరువు తీరుతుంది.. గంగూలీ కీలక వ్యాఖ్యలు
Sourav Ganguly | ఐసీసీ ట్రోఫీలు భారత్‌ను ఊరిస్తూనే ఉన్నాయి. అందినట్లే అంది చేజారుతున్నాయి. దశాబ్ద కాలంగా కోట్లాది మంది అభిమానులు కండ్లలో వత్తులు వేసుకుని చూస్తున్నారు.. మళ్లీ ఎప్పుడు భారత్ ఐసీసీ ట్రోఫీని ముద్దాడుతుందా అని.
Sourav Ganguly | ఐసీసీ ట్రోఫీలు భారత్‌ను ఊరిస్తూనే ఉన్నాయి. అందినట్లే అంది చేజారుతున్నాయి. దశాబ్ద కాలంగా కోట్లాది మంది అభిమానులు కండ్లలో వత్తులు వేసుకుని చూస్తున్నారు.. మళ్లీ ఎప్పుడు భారత్ ఐసీసీ ట్రోఫీని ముద్దాడుతుందా అని. చివరిసారి మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీలో 2013లో చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన టీమిండియా.. చకోర పక్షిలా నిరీక్షిస్తున్నది. అయితే శనివారం 51వ పడిలోకి ప్రవేశించిన భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. స్వదేశం వేదికగా జరిగే మెగా టోర్నీలో మన జట్టు గెలుపు అవకాశాలపై స్పందించాడు. చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్‌శర్మ భారత్‌కు ఐసీసీ ట్రోఫీ కరువును తీరుస్తారని ధీమా వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అపార అనుభవమున్న ద్రవిడ్, రోహిత్ జతగా భారత్ ప్రపంచ విజేతగా నిలుస్తుందని అన్నాడు. గత కొన్నేండ్లుగా ఐసీసీ టోర్నీల్లో విఫలమవుతూ వస్తున్న టీమిండియా ఈసారి మ్యాజిక్ చేస్తుందని చెప్పుకొచ్చాడు.
ఈ సందర్భంగా దాదా మాట్లాడుతూ ‘ఒత్తిడి అనేది కచ్చితంగా ఉంటుంది. సొంతగడ్డపై ఆడుతుండటంతో అభిమానుల మద్దతుతో పాటు అంచనాలు ఎక్కువగా ఉంటాయి. గత ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు కొట్టిన రోహిత్.. ఈసారి అదే రీతిలో రాణిస్తే భారత్‌కు తిరుగుండకపోవచ్చు. ఒత్తిడిని అధిగమించేందుకు అందరూ ప్రయత్నించాల్సి ఉంటుంది. ద్రవిడ్ భారత్‌కు ఆడే సమయంలోనూ తీవ్ర ఒత్తిళ్ల రాణించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు చీఫ్ కోచ్‌గాను అతడిపై మరో రకంగా ఒత్తిడి ఉంటుంది. కానీ అది పెద్ద సమస్య కాకపోవచ్చు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఐదు టైటిళ్లు అందించిన అనుభవం రోహిత్‌కు ఉంది.
ఇదే రీతిలో భారత్‌కు ప్రపంచ కప్ అందిస్తాడన్న నమ్మకం నాకుంది. ఈడెన్‌గార్డెన్స్‌లో ఐదు మ్యాచ్‌లు ఉండటం చాలా సంతోషం. ఇందులో కీలకమైన సెమీస్ మ్యాచ్ కేటాయించిన బీసీసీఐకి కృతజ్ఞతలు. రానున్న రోజుల్లో స్టేడియాన్ని లక్ష్య సామర్థ్యానికి చేరుకునేలా ప్రయత్నం చేస్తాం. గతంలోనూ ఈడెన్ గార్డెన్స్ పలు చరిత్రాత్మక మ్యాచ్‌లకు వేదికైంది. ఈ సారి మెగాటోర్నీలో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్‌కు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. వరల్డ్‌కప్ టోర్నీకి వెస్టిండీస్ అర్హత సాధించకపోవడం షాకింగ్ అనిపించింది. ఇప్పటికైనా విండీస్ బోర్డు సమస్యలపై దృష్టి సారించాలి. చాలామంది క్రికెటర్లు జాతీయ జట్టును వీడి ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు టీ20 లీగ్‌ల్లో వెళుతున్నారు. దీనికి అడ్డుకట్ట వేస్తూ ప్లేయర్ల సమస్యలను పరిష్కరిస్తే గానీ విండీస్ క్రికెట్ జట్టు మళ్లీ గాడిలో పడదు.
Read More :
PV Sindhu | మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన పీవీ సింధు.. కెనడా ఓపెన్ సెమీస్‌కు దూసుకెళ్లిన భారత షట్లర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

