BCCI | టీమిండియా మాజీ క్రికెటర్లు విదేశీ లీగ్‌ల్లో పాల్గొనకుండా బీసీసీఐ నిషేధం..!
BCCI | బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సీజన్ కోసం ఇంపాక్ట్ ప్లేయర్ నియమాల్లో కొన్ని మార్పులు.. మరో వైపు విదేశీ టీ20 లీగ్‌లో భారత ఆటగాళ్లు ఆడడంపై చర్చించారు.
BCCI | బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సీజన్ కోసం ఇంపాక్ట్ ప్లేయర్ నియమాల్లో కొన్ని మార్పులు.. మరో వైపు విదేశీ టీ20 లీగ్‌లో భారత ఆటగాళ్లు ఆడడంపై చర్చించారు. దాంతో పాటు చైనా హాంగ్జౌలో జరిగే ఆసియా క్రీడల్లో టీమిండియా పాల్గొనడం, ప్రపంచకప్‌కు ముందు స్టేడియాల అప్‌గ్రేడేషన్‌పై నిర్ణయాలు తీసుకున్నారు. అయితే, గతకొంతకాలంగా విదేశీ లీగ్‌లో ఆడేందుకు భారత ఆటగాళ్లకు డిమాండ్ ఉన్నది. అయితే, కొంత మంది రిటైర్డ్ క్రికెటర్లు విదేశీ లీగ్‌లో ఆడుతుండగా.. ప్రస్తుతం టీమిండియా తరఫున ఆడే క్రికెటర్లపై నిషేధం ఉంది.
బీసీసీఐ రిటైర్డ్ ఆటగాళ్లు విదేశీ టీ20 లీగ్‌లో పాల్గొనకుండా ఓ విధానాన్ని సిద్ధం చేసేందుకు సన్నద్ధమవుతుంది. విదేశీ లీగ్‌ల నుంచి మంచి ఆఫర్లు వస్తున్న నేపథ్యంలో ఆటగాళ్లు ఆకస్మికంగా రిటైర్మెంట్ ప్రకటించకుండా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. విదేశీ లీగ్‌లో మంచి ఆఫర్ల నేపథ్యంలో చాలా మంది సీనియర్లు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో రిటైర్మెంట్ను అడ్డుకునేందుకు ఓ విధానాన్ని తీసుకురానున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. రాబోయే ఒకటి, రెండు నెలల్లో పాలసీని ఖరారు చేసి, దాన్ని అపెక్స్ కౌన్సిల్ ఆమోదం కోసం పంపనున్నారు.
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన భారత ఆటగాళ్లు మాత్రమే విదేశీ టీ20 లీగ్‌లలో పాల్గొనేందుకు అవకాశం ఉంది. కానీ, రిటైర్డ్ ప్లేయర్ల సంఖ్య భారీగా పెరిగింది. వీరంతా విదేశీ లీగ్‌లలో పాల్గొంటుండడం బీసీసీఐని కలవరానికి గురి చేస్తున్నది. జిమ్ ఆఫ్రో టీ10 లీగ్‌లో భారత మాజీ ఆటగాళ్లు ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, పార్థివ్ పటేల్, శ్రీశాంత్, సువర్ట్ బిన్నీ ఆడుతున్నారు. అమెరికాలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్లో అంబటి రాయుడు పాల్గొననున్నాడు. రాబిన్ ఉతప్ప, యూసుఫ్ పఠాన్ ఈ ఏడాది ప్రారంభంలో ఐఎల్టీ టీ20 లీగ్‌లో పాల్గొని.. స్టార్లుగా నిలిచారు.
అయితే, భారత మాజీ ఆటగాళ్లు మరో లీగ్‌లో ఆడడంతో స్పాన్సర్లు ఆ లీగ్‌ల వైపు వెళ్లే అవకాశాలుండడం బీసీసీఐకి మింగుడుపడడం లేదు. అందుకే రిటైర్డ్ ఆటగాళ్లు సైతం విదేశీ లీగ్‌లలో ఆడకుండా ఉండేలా ఓ పాలసీని తీసుకురావాలని భావిస్తున్నది. అయితే, రిటైర్డ్ ఆటగాళ్లకు బీసీసీఐతో ఎలాంటి ఒప్పందం లేని నేపథ్యంలో.. వారిని ఆడకుండా ఇతర లీగ్‌లలో ఆడకుండా చూడడం అంత సులభమేమీ కాదని ఓ మాజీ క్రికెటర్ పేర్కొన్నాడు. దీనిపై బోర్డు న్యాయపరమైన అభిప్రాయం తీసుకుంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మాజీలు విదేశీ లీగ్‌లలో ఆడేందుకు బీసీసీఐ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలని కోరే అవకాశాలున్నాయని, దీనిపై మార్గదర్శకాలు ఖరారు కావాల్సి ఉందని తెలిపాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

