Afghanistan Cricket Team | వన్డేల్లో అఫ్గనిస్థాన్ సరికొత్త రికార్డు.. ఆ జట్టుకు అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం ఇదే..!
Afghanistan Cricket Team : పసికూనలా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన అఫ్గనిస్థాన్ జట్టు(Afghanistan Cricket Team) రోజు రోజుకు మెరుగవుతోంది. మెగా టోర్నీల్లో పెద్ద టీమ్‌లకు గట్టి పోటీనిస్తున్న ఈ జట్టు ఈరోజు సంచలనం సృష్టించింది. వన్డే ఫార్మాట్(ODI Format)లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. 50 ఓవర్ల ఆటలో...
Afghanistan Cricket Team : పసికూనలా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన అఫ్గనిస్థాన్ జట్టు(Afghanistan Cricket Team) రోజు రోజుకు మెరుగవుతోంది. మెగా టోర్నీల్లో పెద్ద టీమ్‌లకు గట్టి పోటీనిస్తున్న ఈ జట్టు ఈరోజు సంచలనం సృష్టించింది. వన్డే ఫార్మాట్(ODI Format)లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. 50 ఓవర్ల ఆటలో 256 పరుగులతో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేసింది. బంగ్లాదేశ్‌తో జరగుతున్న రెండో వన్డేలో అఫ్గనిస్థాన్ ఈ ఫీట్ సాధించింది.
బంగ్లా బౌలర్లపై విరుచుకుపడిన ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్(145), ఇబ్రహీం జర్డాన్(96 బ్యాటింగ్) తొలి వికెట్‌కు 256 పరుగులు చేశారు. దాంతో, అంతకు ముందు ఉన్న 141 పరుగుల రికార్డు బద్ధలైంది. జావేద్ అహ్మదీ, కరీం సిద్దిఖ్ నెదర్లాండ్స్‌పై 2012 మార్చి 31న ఈ రికార్డు నెలకొల్పారు.
అకాశమే హద్దుగా
బంగ్లాదేశ్ పర్యటనలో ఏకైక టెస్టులో చిత్తుగా ఓడిన అఫ్గనిస్థాన్ ప్రతీకారం తీర్చుకుంటోంది. మొదటి వన్డేలో 14 పరుగులతో గెలుపొందింది. చట్టోగ్రామ్(Chattogram)లో జరుగుతున్న కీలకమైన రెండో వన్డేలోనూ విజయమే లక్ష్యంగా ఆడుతోంది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జర్డాన్ అకాశమే హద్దుగా చెలరేగారు.
సెంచరీతో కదం తొక్కిన రహ్మనుల్లా గుర్బాజ్(145)

గుర్బాజ్(145 : 125 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ జోడిని విడదీసేందుకు బంగ్లా కెప్టెన్ లిట్టన్ దాస్(Litton Das) ఎంతగానో ప్రయత్నించాడు. కానీ, గుర్బాజ్, జర్డాన్ ఒక్క అవకాశం ఇవ్వలేదు. తొలి వికెట్‌కు 256 పరుగులు జోడించారు. గుర్బాజ్‌ను షకిబుల్ హసన్(Shakib Al Hasan) ఔట్ చేయడంతో బంగ్లా ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి
ODI WC 2023 | వరల్డ్ కప్ ఆడడంపై తేల్చేయండి.. ఉన్నత స్థాయి కమిటీకి పాక్ ప్రధాని ఆర్డర్
Alex Carey | బార్బర్‌కు పైసలు ఎగ్గొట్టిన ఆస్ట్రేలియా కీపర్.. డెడ్‌లైన్ లోపు చెల్లిస్తాడా..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

