Alex Carey : యాషెస్ సిరీస్(Ashes Series)లో పర్యాటక ఆస్ట్రేలియా జట్టు అదరగొడుతోంది. అయితే.. రెండో టెస్టులో ఆ జట్టు క్రీడా స్ఫూర్తి(Spirit Of Cricket)ని విస్మరించడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అందుకు ప్రధాన కారణం వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(Alex Carey)నే. జానీ బెయిర్‌స్టో(Jonny Bairstow)ను స్టంపౌట్ చేసిన అతను వివాదానికి కేంద్రంగా నిలిచాడు. దాంతో, ఇంగ్లీష్ మీడియాలో యాషెస్ విలన్(Ashes Villain)గా ముద్ర పడిన అతను మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి ఏం చేశాడో తెలుసా..? లీడ్స్‌లోని ఒక బార్బర్‌కు పైసలు ఎగ్గొట్టాడు. దాంతో, సదరు వ్యక్తి క్యారీకి డెడ్‌లైన్ విధించాడు.
అవును.. ఆడం మహమూద్(Adam Mahmood) అనే బార్బర్ వద్ద క్యారీ కటింగ్ చేసుకున్నాడు. అందుకు 30 యూరోలు అంటే.. మన కరెన్సీలో రూ.2,718 అయింది. అయితే.. ఈ ఆసీస్ కీపర్ తన వద్ద అంత డబ్బు లేదని, తప్పకుండా ఇచ్చేస్తానని ఆడంకు ప్రామిస్ చేశాడు. కానీ, ఇప్పటివరకు అతడికి పైసా కూడా ఇవ్వలేదు. దాంతో, చిర్రెత్తుకొచ్చిన మహమూద్ క్యారీకి డెడ్‌లైన్ విధించాడు. ఈ సోమవారం(జూలై 10)లోగా డబ్బులు ముడితే తాను సంతోషిస్తానని లేదంటే తన ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని తెలిపాడు. మరి క్యారీ ఆ లోపు ఆ బార్బర్ బాకీ చెల్లిస్తాడా? లేదంటే ఎగ్గొడతాడా? అనేది చూడాలి.
వరల్డ్ నంబర్ 1 ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్‌లో అదరగొడుతోంది. రెండు టెస్టుల్లో గెలిచి ఐదు టెస్టుల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉంది. అయితే.. రెండో టెస్టులో జానీ బెయిర్‌స్టోను క్యారీ ఔట్ చేసిన విధానం వివాదాస్పదమైంది. ఆసీస్ జట్టు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించలేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఆ విషయాన్ని మరువక ముందే క్యారీ మరోసారి వివాదాస్పద క్యాచ్‌తో మీడియా కంట పడ్డాడు.
డకెట్ ఇచ్చిన క్యాచ్ నోటితో పట్టిన క్యారీ
మూడో టెస్టు రెండో రోజు బెన్ డకెట్(2) ఇచ్చిన క్యాచ్‌ను క్యారీ నోటి సాయంతో పట్టుకున్నాడు. దాంతో, కామెంటరీ బాక్స్‌లో నుంచి ఇదంతా గమనించిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆసీస్ కీపర్‌పై మండిపడ్డాయి. అది స్మూచ్ అని వర్ణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 237 పరుగులకు ఆలౌటయ్యింది. దాంతో, కమిన్స్ సేనకు 31 పరుగుల ఆధిక్యం లభించింది.