Srilanka | వన్డే ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో శ్రీలంక జోరు.. పాయింట్ల పట్టికలో టాప్ !
వన్డే ప్రంపచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో దుమ్మురేపుతున్న శ్రీలంక.. సూపర్ సిక్స్ ఐదో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. శుక్రవారం జరిగిన పోరులో లంక 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తుచేసింది.
Srilanka | హరారే: వన్డే ప్రంపచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో దుమ్మురేపుతున్న శ్రీలంక.. సూపర్ సిక్స్ ఐదో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. శుక్రవారం జరిగిన పోరులో లంక 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తుచేసింది. మొదట విండీస్ 48.1 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. కార్టీ (87) టాప్ స్కోరర్ కాగా.. లంక బౌలర్లలో తీక్షణ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో లంక 44.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది.
పాతుమ్ నిషాంక (104; 14 ఫోర్లు) శతక్కొట్టగా.. దిముత్ కరుణరత్నె (83) రాణించాడు. ఈ టోర్నీ సూపర్ సిక్స్‌లో ఆడిన 5 మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన లంక 10 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటికే వన్డే ప్రపంచకప్ బెర్త్ ఖరారు చేసుకున్న శ్రీలంక, నెదర్లాండ్స్ మధ్య ఆదివారం క్వాలిఫయింగ్ టోర్నీ ఫైనల్ జరుగనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

