న్యూఢిల్లీ: భారత్ (India), వెస్టిండీస్ (West Indies) జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ (Test Series) ఈ నెల 12 నుంచి ప్రారంభంకానుంది. సిరీస్ కోసం బీసీసీఐ (BCCI) ఇప్పటికే భారత జట్టును ప్రటించింది. తాజాగా వెస్టిండీస్ కూడా 13 మందితో కూడిన తమ టీమ్‌ను ఎంపిక చేసింది. అయితే మొదటి టెస్టు కోసమే జట్టును ఎంపిక చేయడం విశేషం. కెప్టెన్‌గా క్రెగ్ బ్రాట్‌వైట్ (Kraigg Brathwaite) కొనసాగుతుండగా.. విండీస్ బాహుబలి రకీం కార్న్‌వాల్ (Rahkeem Cornwall) జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు. మరో ఇద్దరు బ్యాట్స్మెన్లు అథనాజ్, మెకంజీలు తొలిసారి జట్టులో స్థానం దక్కించుకున్నారు.
కాగా, రకీం కార్న్‌వాల్ 2021 తర్వాత దేశానికి ప్రాతినిథ్యం వహిస్తుండటం ఇదే మొదటిసారి. ఆల్‌రౌండర్ అయిన రకీం.. 2019లో భారత జట్టుపైనే ఆరంగేట్రం చేయడం విశేషం. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ట్వీకర్ జోమెల్ వారికన్‌కు జట్టులో స్థానం కల్పించారు. వీరితోపాటు రిజర్వ్ ఆటగాళ్లుగా టెవిన్ ఇమ్లాచ్, అకీమ్ జోర్డాన్ ఉన్నారు.
తొలి టెస్టుకు విడీస్ జట్టు..క్రెగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథనాజ్, తగ్‌నరన్ చందర్‌పాల్, రకీం కార్న్‌వాల్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, జేసన్ హోల్డర్, అల్జారీ జోసఫ్, కిర్క్ మెకంజీ, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జోమెల్ వారికాన్.