భళారే బ్రార్
ఓ వైపు వాన.. మరోవైపు ఓటమి వెంబడించిన మ్యాచ్‌లో భారత్ అద్భుతం చేసింది. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో పరాజయం అంచుల్లోకి వెళ్లి విజయం అందుకుంది.
- యువ పేసర్ గుర్నూర్
- రాణించిన శ్రేయస్, రాహుల్
- న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
వెల్లింగ్టన్: ఓ వైపు వాన.. మరోవైపు ఓటమి వెంబడించిన మ్యాచ్‌లో భారత్ అద్భుతం చేసింది. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో పరాజయం అంచుల్లోకి వెళ్లి విజయం అందుకుంది. శనివారం వర్షం అంతరాయం మధ్య ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ఆరున్నర అడుగుల యువ పేసర్ గుర్నూర్ బ్రార్ (4/30) ఖతర్నాక్ బౌలింగ్‌కు తోడు.. శ్రేయస్ అయ్యర్ (30), కేఎల్ రాహుల్ (26 నాటౌట్) విలువైన ఇన్నింగ్స్‌లతో టీమిండియా 4 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్ధతి) ఆతిథ్య జట్టును ఓడించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యం సాధించింది. తొలుత 47 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో కివీస్ 41 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది.
డారిల్ మిచెల్ (55), మిచెల్ శాంట్నర్ (31) రాణించారు. భారత బౌలర్లలో బ్రార్‌కు తోడు ఆకిబ్ నబీ (2/31), అన్షుల్ కాంబోజ్ (2/25), అక్షర్ పటేల్ (2/28) ప్రత్యర్థిని దెబ్బకొట్టారు. అనంతరం చిన్న లక్ష్య ఛేదనలో భారత్ 26 ఓవర్లలో 113/7తో నిలిచిన దశలో వర్షంతో మ్యాచ్ ఆగిపోయింది. డీఎల్ఎస్ ప్రకారం అప్పటికి లక్ష్యాన్ని 110 పరుగులుగా లెక్కగట్టగా.. గిల్‌సేన గట్టెక్కింది. రోహిత్ శర్మ (23) మెరిసినా.. కెప్టెన్ గిల్ (0), విరాట్ కోహ్లీ (7), అక్షర్ పటేల్ (7) ఫెయిలవడంతో ఓ దశలో 86/5తో డీలా పడ్డ జట్టును రాహుల్ విజయతీరాలకు చేర్చాడు. బ్రార్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మూడో వన్డే మంగళవారం హామిల్టన్‌లో జరుగుతుంది.
246 బంతుల్లో 176 డాట్స్..
వర్షం, ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో ఆలస్యంగా మొదలైన ఈ పోరులో పిచ్ నుంచి లభించిన సహకారాన్ని సద్వినియోగం చేసుకొని భారత యువ పేస్ త్రయం గుర్నూర్ బ్రార్, అన్షుల్ కాంబోజ్, ఆకిబ్ నబీ మఆతిథ్య జట్టును వణికించారు. విసురుతూ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ గిల్ నిర్ణయానికి పూర్తి న్యాయం చేశారు. భారత బౌలర్లు ఏకంగా 176 డాట్ బాల్స్ వేసి ఆతిథ్య బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు.
ముఖ్యంగా పంజాబ్ పొడగరి బ్రార్ కెరీర్ బెస్ట్ బౌలింగ్‌తో ప్రత్యర్థి నడ్డి విరిచాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఓపెనర్ సిఫర్ట్ (0) డకౌట్ చేసిన నబీ.. ఆరో ఓవర్లో విల్ యంగ్ (6) పని పట్టి కివీస్ పతనం ఆరంభించాడు. నికోల్స్(11).. అన్షుల్ బంతిని వికెట్ల మీదకు ఆడుకొని బౌల్డ్ అవ్వడంతో కివీస్ 23/3తో నిలిచింది. అప్పటికే క్రీజులో కుదురుకున్న డారిల్.. నబీ బౌలింగ్‌లో రెండు ఫోర్లతో పాటు ఓ లాఫ్టెడ్ సిక్స్ కూడా కొట్టాడు. 21 పరుగుల వద్ద గిల్ క్యాచ్ డ్రాప్ చేయడంతో బతికి పోయిన అతను లాథమ్ (7)తో నాలుగో వికెట్‌కు 30 పరుగులు జోడించాడు. కానీ, 20వ ఓవర్లో లాథమ్‌తో పాటు ఇన్ఫామ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ (0)ను పెవిలియన్ చేర్చిన బ్రార్ ప్రత్యర్థికి డబుల్ షాకిచ్చాడు.
ఈ దశలో శాంట్నర్, డారిల్ జాగ్రత్తగా ఆడుతూ 15 ఓవర్ల పాటు వికెట్ కాపాడుకున్నారు. ఈ క్రమంలో అక్షర్ బౌలింగ్ శాంట్నర్ ఓ సిక్స్ కొట్టగా.. నబీ ఓవర్లో సిక్స్, బ్రార్ బౌలింగ్‌లో ఫోర్‌తో మిచెల్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కానీ, అక్షర్ వేసిన 35వ ఓవర్లో భారీ షాట్‌కు యత్నించిన మిచెల్.. అన్షుల్‌కు చిక్కడంతో ఆరో వికెట్‌కు 55 పరుగుల కీలక భాగస్వామ్యం విడిపోయింది. బ్రార్ వేసిన తర్వాతి ఓవర్లో సిక్స్ బాదిన శాంట్నర్ మరుసటి బంతికే కీపర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చాడు. టెయిలెండర్లు కివీస్‌ను ఆదుకోలేకపోయారు. అక్షర్ బౌలింగ్‌లో జేమీసన్ (7) బౌల్డ్ అవ్వగా.. నేథన్ స్మిత్ (3)ను బ్రార్ ఔట్ చేశాడు. టిక్నర్ (2)ను అన్షుల్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ మరోసారి తక్కువ స్కోరుకే ముగిసింది.
ఆదుకున్న అయ్యర్, రాహుల్
చిన్న ఛేదనలో భారత్‌కు ఆరంభంలోనే వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. గత మ్యాచ్‌లో నిరాశపరిచిన ఓపెనర్ రోహిత్ టచ్‌లోకి వచ్చినా కెప్టెన్ గిల్.. డఫీ బౌలింగ్‌లో డకౌటై ఇన్నింగ్స్ ఏడో బంతికే పెవిలియన్ చేరాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ ఈసారి నిరాశపరిచి డఫీకే వికెట్ ఇచ్చుకున్నాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన వైస్ కెప్టెన్ శ్రేయస్ డఫీ బౌలింగ్‌తో సిక్స్ కొట్టగా.. జెమీసన్ వరుస ఓవర్లలో రెండు సిక్సర్లతో రోహిత్ అలరించాడు.
కానీ, అదే ఊపులో మరో షాట్‌కు ప్రయత్నించిన హిట్‌మ్యాన్ నికోల్స్‌కు చిక్కాడు. ఐదో నంబర్లో వచ్చిన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (7) కూడా నిరాశపరచడంతో 47/4తో భారత్ డీలా పడింది. క్లిష్ట సమయంలోశ్రేయస్కు తోడైన రాహుల్ గెలుపు బాధ్యత తీసుకున్నాడు. స్పిన్నర్ నేథన్ స్మిత్‌ను టార్గెట్ చేసి 4,6 కొట్టి ఛేజింగ్‌కు ఊపు తెచ్చాడు. అటువైపు అయ్యర్ కూడా క్రమం తప్పకుండా బౌండరీలు రాబట్టడంతో భారత్ సులువుగానే గెలిచేలా కనిపించింది.
కానీ, 20వ ఓవర్లో ఊరించే షార్ట్ బాల్‌తో అయ్యర్‌ను ఐదో వికెట్‌గా వెనక్కుపంపిన జేమీసన్ కివీస్‌ను తిరిగి రేసులోకి తెచ్చాడు. క్లిష్ట సమయంలో రాహుల్ ఏమాత్రం సంయమనం కోల్పోకుండా క్రీజులో పాతుకుపోయాడు. డఫీ బౌలింగ్‌లో సిక్స్‌తో స్కోరు వంద దాటించాడు. కానీ, రెండు ఫోర్లు కొట్టిన నమన్ ధీర్ (12)ను డఫీ ఔట్ చేయగా.. జెమీసన్ బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడిన అన్షుల్ (1) పెవిలియన్ చేరడంతో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. అప్పటికీ జట్టు విజయానికి మరో 22 రన్స్ అవసరం అయ్యాయి. కానీ, మూడు బంతుల తర్వాత మళ్లీ వర్షం వచ్చి మ్యాచ్ ఆగిపోవడంతో భారత జట్టు ఊపరిపీల్చుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

