WTC Final : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు మరో మూడు రోజులే ఉంది. ఇప్పటికే లండన్ చేరుకున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు మ్యాచ్ కోసం సన్నద్ధమవుతున్నారు. రెండో ఫైనలిస్ట్ అయిన దక్షిణాఫ్రికా (South Africa) జట్టు సైతం శనివారం లండన్‌లో అడుగుపెట్టింది. ప్రతిష్టాత్మకమైన టెస్టు గద (Test Mace) పోరుకోసం ప్రత్యేక బస్సులో లార్డ్స్ చేరుకున్నారు సఫారీ క్రికెటర్లు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడుతున్నామనే భావన ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందని చెప్పారు ప్రొటీస్ ప్లేయర్లు. ఆ జట్టు ప్రధాన ఆటగాళ్లు మర్క్రమ్, కేశవ్ మహరాజ్, ట్రిస్టన్ స్టబ్స్, పేసర్ కార్బిన్ బాస్చ్లు బిగ్ ఫైట్‌లో విజయం తమదేననే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తమ స్క్వాడ్ లండన్‌లోని టీమ్ హోట్‌ల్‌కు బస్సులో వెళ్తున్న వీడియోను సౌతాఫ్రికా బోర్డు ఆదివారం ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేసింది.
London, the Proteas have arrived! 🇿🇦
It’s time for the #WTCFinal showdown! 💪#WTC25 #ProteasWTCFinal pic.twitter.com/VrAde0xbRn
— Proteas Men (@ProteasMenCSA) June 8, 2025
డబ్ల్యూటీసీ మూడో సీజన్ ఫైనల్ జూన్ 11న మొదలుకానుంది. లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలు టెస్టు గద కోసం హోరాహోరీగా తలపడనున్నాయి. కమిన్స్ సారథ్యంలోని ఆసీస్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆడనుండగా.. సఫారీల తమ ఐసీసీ ట్రోఫీ కలను సాకారం చేసుకునేందుకు శ్రమించనున్నారు. నిరుడు టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో 7 పరుగుల తేడాతో ఓడిన ప్రొటీస్ టీమ్.. ఈసారి ‘ఛాంపియన్లం’ అనిపించుకోవాలనే కసితో ఉంది. దాంతో, డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌పై అభిమానుల్లో ఆసక్తి ఎక్కువవుతోంది.
టెస్టు క్రికెట్‌ను బతికించేందుకు ఐసీసీ నిర్వహిస్తున్న ఈ ఛాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్ మొట్టమొదటి ఛాంపియన్‌గా అవతరించింది. రెండేళ్ల క్రితం భారత్‌కు షాకిస్తూ ఆస్ట్రేలియా టెస్టు గదను తన్నుకుపోయింది. దాంతో, వరుసగా రెండు పర్యాయాలు ఫైనల్ చేరిన టీమిండియా రన్నరప్‌గా తిరిగొచ్చింది. ఈ నేపథ్యంలో లార్డ్స్‌లో జరుగబోయే మూడో ఫైనల్లో విజయం ఎవరిని వరిస్తుంది? అనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది.