చెన్నై: యువ వైద్యుడు అప్పులపాలయ్యాడు. కారులో సెలైన్ ఎక్కించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. (Doctor Suicide) మూడు రోజులుగా కారు అక్కడ ఉంటడాన్ని స్థానికులు గమనించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని కొడైకెనాల్లో ఈ సంఘటన జరిగింది. డాక్టర్ జాషువా సామ్రాజ్ సేలంలో డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (ఎండీ) చదువుతున్నాడు. మధురైలోని ఒక ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు.
కాగా, కొడైకెనాల్ సమీపంలోని పూంపరై మారుమూల అటవీ ప్రాంతంలో ఒక కారు మూడు రోజులుగా ఉండటాన్ని స్థానికులు గమనించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. కారు లోపల డాక్టర్ జాషువా సామ్రాజ్ మరణించి ఉండటాన్ని గమనించారు. కారులో ఉన్న సూసైడ్ నోట్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆత్మహత్యకు కారణాన్ని అందులో పేర్కోలేదు.
మరోవైపు ఒక మహిళతో రిలేషన్షిప్ సమస్య కారణంగా తమ కుమారుడు నిరాశకు గురయ్యాడని అతడి కుటుంబం తెలిపింది. ఆ యువ డాక్టర్ అప్పుల్లో కూరుకుపోయినట్లు దర్యాప్తులో పోలీసులు తెలుసుకున్నారు. అయితే ఆ మహిళ కారణంగానా లేక ఆన్లైన్ గేమింగ్ వల్ల అప్పులపాలయ్యాడా అన్నది తెలియలేదు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read: