భువనేశ్వర్: పెళ్లి వేడుకలో పాల్గొన్న ఇద్దరు బాలికలను ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. (Girls Kidnapped From Wedding) వారిని జనం లేని ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడకు మరో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. నలుగురు వ్యక్తులు కలిసి ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒడిశాలోని గంజాం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూన్ 3న జరిగిన పెళ్లి వేడుకలో 14, 15 ఏళ్ల వయస్సున్న ఇద్దరు బాలికలు పాల్గొన్నారు. ఒక బాలికకు తెలిసిన వ్యక్తితోపాటు మరో వ్యక్తి వారిని మభ్యపెట్టి నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడకు మరో ఇద్దరు వ్యక్తులు చేరుకున్నారు. నలుగురు కలిసి ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, బాలికల కోసం వెతికిన కుటుంబ సభ్యులు జనం లేని ప్రాంతంలో వారిని గుర్తించారు. వారిపై లైంగిక దాడి జరిగినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. అదే గ్రామానికి చెందిన నలుగురు నిందితులు విశాఖపట్నం పారిపోతుండగా అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
Also Read: