పనాజి: ఆరోగ్య మంత్రి సహనం కోల్పోయారు. (Goa Minister Loses Cool) చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో)పై అందరి ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగక ఆ సీనియర్ డాక్టర్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఆ మంత్రి తీరుపై విమర్శలు వచ్చినప్పటికీ తన చర్యను ఆయన సమర్థించుకున్నారు. బీజేపీ పాలిత గోవాలో ఈ సంఘటన జరిగింది. ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే శనివారం ఆకస్మికంగా బాంబోలిమ్‌లోని గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌ను సందర్శించారు. క్యాజువాలిటీ వార్డులో తన అత్తపై డాక్టర్ అహంకారంగా ప్రవర్తించారన్న సీనియర్ జర్నలిస్ట్ ఆరోపణను మంత్రి ప్రస్తావించారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో) డాక్టర్ రుద్రేష్ కుర్తికర్పై అందరి ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆ సీనియర్ డాక్టర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని అక్కడికక్కడే ఆదేశించారు.
కాగా, డ్యూటీలో ఉన్న సీఎంవోను తొలగించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే తీరును ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తప్పుపట్టింది. అయితే తన చర్యను ఆ మంత్రి సమర్థించుకున్నారు. రోగి పట్ల ఆ వైద్యుడు అహంకారపూరితంగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. వైద్య సేవలు నిరాకరించిన రోగికి తాను అండగా నిలిచినట్లు చెప్పారు. అందుకే ఆ డాక్టర్‌తో తన ప్రవర్తనపై క్షమాపణ చెప్పబోనని మీడియాతో అన్నారు.
Is @visrane truly fit to serve as Goa’s Health Minister? His increasingly erratic and unstable behaviour raises serious concerns about his ability to responsibly oversee the state’s health system.
The shocking incident at Goa Medical College (GMC) where Vishwajit Rane chose to… pic.twitter.com/3qLrgJiCV8
— Goa Congress (@INCGoa) June 7, 2025
Also Read: