న్యూఢిల్లీ, జూన్ 7 : యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా రూపొందించిన ఆధార్ అప్లికేషన్ను ఉపయోగించి రియల్ టైమ్లో ప్రయాణికుల ఆధార్ ఐడీలను టికెట్ చెకింగ్ సిబ్బంది ధ్రువీకరిస్తారని రైల్వే శాఖ శనివారం అన్ని జోన్లకు పంపిన ఓ అధికారిక వర్తమానంలో తెలియచేసింది.
దేశంలో చట్ట విరుద్ధంగా నివసిస్తున్న వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డులను ఉద్యోగాలు, ప్రయాణాలతోసహా వివిధ అవసరాల కోసం ఉపయోగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఆధార్ కార్డును ఉపయోగించి ఒక వ్యక్తి పేరుతో మరో వ్యక్తి ప్రయాణించడం వంటి నేరాలను అరికట్టేందుకు ఐడీలను తనిఖీ చేసే యంత్రాంగాన్ని బలోపేతం చేస్తున్నట్లు పేర్కొంది. నకిలీ ఆధార్ కార్డులతో ప్రయాణించే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది.