Retirement Benefits | బెనిఫిట్స్ కోసం రోడెక్కిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు.. నేడు ‘చలో బస్‌భవన్’
Retirement Benefits | తెలంగాణ ఆర్టీసీలో రిటైర్డ్ ఉద్యోగులు అరిగోస పడుతున్నారు. ఆర్టీసీ సంస్థ నిర్లక్ష్యంతో సకాలంలో బెనిఫిట్స్ అందక.. ఇప్పట్లో అవి రావేమోననే బెంగతో, అనారోగ్య సమస్యలతో తనువు చాలిస్తున్నారు. ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వ నిరంకుశ వైఖరి వల్ల దాదాపు 17 వేలమంది రిటైర్డ్ ఉద్యోగులు తమ బెనిఫిట్స్ కోసం ప్రతినెలా వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు.
Retirement Benefits | హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఆర్టీసీలో రిటైర్డ్ ఉద్యోగులు అరిగోస పడుతున్నారు. ఆర్టీసీ సంస్థ నిర్లక్ష్యంతో సకాలంలో బెనిఫిట్స్ అందక.. ఇప్పట్లో అవి రావేమోననే బెంగతో, అనారోగ్య సమస్యలతో తనువు చాలిస్తున్నారు. ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వ నిరంకుశ వైఖరి వల్ల దాదాపు 17 వేలమంది రిటైర్డ్ ఉద్యోగులు తమ బెనిఫిట్స్ కోసం ప్రతినెలా వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. 17 వేల మందికి ప్రభుత్వం సుమారు రూ.2 వేల కోట్లవరకు బకాయి పడిందని, వాటిని ఇప్పించాలని కోరితే తమ గోస పట్టించుకోవడం లేదని.. అందుకే మంగళవారం ‘చలో బస్ భవన్’కు పిలుపునిచ్చామని తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పేర్కొన్నది. ఒక్కో రిటైర్డ్ ఉద్యోగికి సుమారు రూ.13 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు రావాల్సి ఉన్నదని చెప్తున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని రవాణాశాఖ మంత్రి, ఆర్టీసీ ఎండీలకు ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోకపోవడంతో వృద్ధాప్యంలోనూ ఆందోళనలు చేయాల్సి వస్తున్నదని అంటున్నారు. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు ఆర్టీసీ కార్మిక జేఏసీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. నిరసనకు టీజేఎంయూ హనుమంతు ముదిరాజ్ సైతం మద్దతు తెలిపారు.
ఎక్కడి బెనిఫిట్స్ అక్కడే ఆగినయ్
ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో సకాలంలో స్పందించకపోవడంతో ఎక్కడి బెనిఫిట్స్ అక్కడే ఆగిపోయాయని వాపోతున్నారు. కొన్నేండ్లుగా రిటైర్మెంట్ పెన్షన్ స్కీమ్ (ఆర్పీఎస్), 2017, 2021 ఏరియర్స్, లీవ్ ఎన్క్యాష్మెంట్లు, గ్రాట్యుటీ డిఫరెన్స్ డబ్బులు, ఆగిన లీవ్ ఎన్క్యాష్మెంట్లు రిటైర్ అయిన వారందరికీ అర్హత చొప్పన ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రాట్యుటీ, ఆఖరు నెల జీతం ఇవ్వాలని పలుమార్లు ఆర్టీసీ ఎండీకి రాతపూర్వక విజ్ఞాపన పత్రాలు ఇచ్చినప్పటికీ వాటిపై స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ కారణాలతో తిరసరించిన పీఎఫ్ అప్లికేషన్లు సైతం సరిచేయడం లేదని రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికులు మండిపడుతున్నారు. రిటైర్ అయిన కొందరికి డిమాండ్ నోటీసులు రావడం లేదని, 2013, 2017 వేతన సవరణ వివరాలను పీఎఫ్ కమిషనర్‌కు పంపకపోవడం వల్ల హయ్యర్ పెన్షన్ ఆగిపోయిందని కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల డిమాండ్లు
- 2013 పీఆర్సీ ఏరియర్స్‌పై యాజమాన్యం చెల్లించాల్సిన పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌ను తక్షణమే పీఎఫ్ కమిషనర్ ఆఫీసుకు పంపాలి. దీనివల్ల విశ్రాంత ఉద్యోగుల పీఎఫ్ పెన్షన్ పెరుగుతుంది.
- 2017 పీఆర్సీ బకాయిలు నిలిచిపోయి 9 ఏండ్లు అవుతున్నందున వాటితోపాటు, 2021 పీఆర్సీ అమలు చేసి, రావాల్సిన ఏరియర్స్‌ను వెంటనే చెల్లించాలి.
- విశ్రాంత ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములకు సూపర్ లగ్జరీ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వాలి.
- తార్నాక దవాఖానలో విశ్రాంత ఉద్యోగులకు గతంలోలాగే ఒకేసారి రెండు నెలల కు సరిపడా మందులు ఇవ్వాలి. ప్రస్తుతం ఒక నెలకే ఇస్తుండటం వల్ల జిల్లాల నుంచి వచ్చే వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. దవాఖానల్లో అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచాలి.
- గతంలో తార్నాక దవాఖాన మెంబర్షిప్ తీసుకోలేకపోయినవారికి మరొకసారి అవకాశం కల్పించాలి.
- స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకున్న ఉద్యోగులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు ఇచ్చే దహన సంసారాల సహాయాన్ని రూ.30 వేలకు పెంచాలి.
- అనారోగ్య కారణాల వల్ల ఎస్ఆర్బీఎస్ లైఫ్ సర్టిఫికెట్ ప్రతి సంవత్సరం ఇవ్వలేని మూడేండ్లు దాటినవారికి ఈ నెల నుంచి లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే వెసులుబాటు కల్పించాలి.
- జిల్లాల నుంచి తార్నాక దవాఖానకు వచ్చే విశ్రాంత ఉద్యోగులకు సీబీఎస్ లేదా జేబీఎస్‌లోని రెస్ట్ రూముల్లో కనీసం 4 బెడ్లు కేటాయించాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

