బహ్రెయిన్‌పై ఇరాన్ దాడులు
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు ముదిరాయి. బహ్రెయిన్ పై ఇరాన్ ఆదివారం తెల్లవారుజామున డ్రోన్లతో విరుచుకుపడింది. మూడు రోజుల్లో ఆ దేశంపై ఇరాన్ జరిపిన రెండో దాడి ఇది.
- అమెరికా రాడార్ లక్ష్యంగా డ్రోన్లతో విరుచుకుపడ్డ ఐఆర్జీసీ
- మూడు రోజుల్లో ఇది రెండో దాడి
మనామా, నవంబర్ 15: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు ముదిరాయి. బహ్రెయిన్ పై ఇరాన్ ఆదివారం తెల్లవారుజామున డ్రోన్లతో విరుచుకుపడింది. మూడు రోజుల్లో ఆ దేశంపై ఇరాన్ జరిపిన రెండో దాడి ఇది. కొన్ని నెలలుగా దాడులకు విరామం కొనసాగగా, తాజాగా ఇంధన సంపద అధికంగా ఉన్న గల్ఫ్ ప్రాంతంలో తిరిగి దాడులు ప్రారంభమయ్యాయి. ఇరాన్ డ్రోన్ల దాడితో బహ్రెయిన సైరన్ మోతలతో దద్దరిల్లింది. అయితే, డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయని బహ్రెయిన్ సైన్యం, విదేశాంగ శాఖ తెలిపాయి. పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ అధికారులు కోరారు.
సెప్టెంబర్ తర్వాత ఆ దేశంలో ఇటువంటి హెచ్చరికలు రావడం ఇదే తొలిసారి. బహ్రెయిన్‌లోని అల్ రిఫా హెలికాప్టర్ స్థావరంలో ఉన్న అమెరికా వైమానిక రక్షణ రాడార్ వ్యవస్థను తమ ఏరోస్పేస్ ఫోర్స్‌కు చెందిన ఆరు డ్రోన్లతో లక్ష్యంగా చేసుకున్నామని ఐఆర్ జీసీ ఒక ప్రకటనలో తెలిపింది. గత వారం దక్షిణ ఇరాన్‌లోని సిరిక్‌లో టెలికమ్యూనికేషన్ టవర్‌పై అమెరికా చేసిన దాడికి ప్రతీకారంగానే ఈ చర్య చేపట్టామని తెలిపింది. దీనిని ‘అమెరికా దురాక్రమణ’కు ప్రతిస్పందనలో రెండో దశగా పేర్కొంది. అమెరికా మరోసారి సైనిక చర్యలకు దిగితే మరింత తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని తెలిపింది. హొర్ముజ్ జలసంధి మూసివేసే ఉందని స్పష్టం చేసింది. అమెరికా లక్ష్యాలపై దాడులను తీవ్రతరం చేస్తామని హెచ్చరించింది. ఇరాన్ దాడులను జోర్డాన్, ఈజిప్ట్ తీవ్రంగా ఖండించాయి.
- అవయవాలు అమ్ముకుంటున్న ఇరాన్ ప్రజలుతీవ్ర ఆర్థిక సంక్షోభంతో బతుకలేని పరిస్థితులు
టెహ్రాన్: అమెరికాతో యుద్ధం వల్ల ఇరాన్ ప్రజలు తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నట్టు ఇరాన్ ఇంటర్నేషనల్ వార్తాసంస్థ పరిశోధనలో వెల్లడైంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అప్పుల భారంతో కుటుంబాలకు కనీస అవసరాలు తీర్చుకోవడమే కష్టమవుతున్నది. ఆర్థిక సంక్షోభం తీవ్రంగా పెరగడంతో కొందరు ఇరానీయులు కుటుంబాలను పోషించేందుకు కిడ్నీలు, ఎముక మజ్జ, వృషణాలు సహా శరీర అవయవాలను అమ్ముకుంటున్నారని తేలింది. మే నుంచి అక్టోబర్ దాకా ఒక టెలిగ్రామ్ ఛానల్లో వచ్చిన 600కుపైగా ప్రకటనలను ఇరాన్ ఇంటర్నేషనల్ పరిశీలించింది.
వీటిలో మూడో వంతు ప్రకటనలు అవయవాల అమ్మకాలను బయటపెట్టాయి. ఇందులో ఎక్కువగా కిడ్నీల అమ్మకాలు, తర్వాత ఎముక మజ్జ 279 కేసులు, 51 కేసుల్లో కాలేయ అమ్మకాలు ఉన్నట్టు తేలింది. ఇలా అవయవాలను అమ్ముకుంటున్న వారు ఎక్కువ మంది కుటుంబాన్ని కూడా పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారని ఈ విచారణ వెల్లడించింది. అమెరికాతో యుద్ధం ముగింపునకు సరైన మార్గం కనిపించకపోవడంతో ఇరాన్లో పరిస్థితులు ఇంకా కుదుట పడట్లేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

