నువ్వు చనిపోతే బాగుంటుంది!
ఎన్విడియా మాజీ సీఈవో జెన్సన్ హువాంగ్ సమావేశాల్లో తన కిందిస్థాయి ఉద్యోగులపై ఆగ్రహావేశాలు ప్రదర్శించేవారని న్యూయార్క్ పోస్ట్ కథనం వెల్లడించింది.
- జయ్ పురీపై జెన్సన్ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు కథనం
న్యూయార్క్: ఎన్విడియా మాజీ సీఈవో జెన్సన్ హువాంగ్ సమావేశాల్లో తన కిందిస్థాయి ఉద్యోగులపై ఆగ్రహావేశాలు ప్రదర్శించేవారని న్యూయార్క్ పోస్ట్ కథనం వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 30 మందికిపైగా కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్న సమావేశంలో, అప్పటి ప్రపంచవ్యాప్త ఫీల్డ్ ఆపరేషన్ల ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జయ్ పురీని హువాంగ్ లక్ష్యంగా చేసుకున్నట్టు కథనం తెలిపింది.
ఒక దశలో పురీని ‘చావుపో’ అని హువాంగ్ అన్నట్టు పేర్కొంది. ‘నీకు ఫ్లూ వచ్చి అది మరింత తీవ్రమవ్వాలని కోరుకుంటున్నా. నువ్వు చనిపోయి మా అందరికీ ఈ బాధ తప్పించాలని కోరుకుంటున్నా’ అని హువాంగ్ పురీతో అన్నట్టు ఘటనపై అవగాహన ఉన్నవారిని ఉటంకిస్తూ న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. అప్పట్లో ఎన్విడియా అమ్మకాలు, వ్యాపార అభివృద్ధి కార్యకలాపాలను పర్యవేక్షించిన పురీ, సహోద్యోగులతో కలిసి మౌనంగా విస్తుపోయి కూర్చున్నారని కథనం పేర్కొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

