పాలమూరుకు పర్యావరణ అనుమతులివ్వండి
పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మసాగర్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్లతో బరాజ్‌ను నిర్మించేందుకు మహారాష్ట్ర సర్కార్‌ను ఒప్పించాలని విన్నవించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వాకిటి శ్రీహరి ఆదివారం భేటీ అయ్యారు.
- 152 మీటర్ల బరాజ్‌కు మహారాష్ట్రను ఒప్పించండి
- ప్రధాని మోదీకి రేవంత్ వినతి
- సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మసాగర్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్లతో బరాజ్‌ను నిర్మించేందుకు మహారాష్ట్ర సర్కార్‌ను ఒప్పించాలని విన్నవించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వాకిటి శ్రీహరి ఆదివారం భేటీ అయ్యారు. డిసెంబర్ 11వ తేదీ నుంచి 22వ తేదీ వరకు తెలంగాణలో నిర్వహించనున్న ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026’ ప్రారంభ, ముగింపు కార్యక్రమాలకు హాజరుకావాలని ప్రధాని మోదీని ఆహ్వానించారు.
క్రీడా ఏర్పాట్లను ప్రధానికి వివరించారు. అనంతరం రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పర్యావరణ అనుమతులు, అంతర్రాష్ట్ర జల వివాదాలు, కేంద్ర నిధులు, భూగర్భ జలాల పరిరక్షణ తదితర అంశాలపై ప్రధానితో చర్చించారు. అనంతరం మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి మీడియాతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానితో భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. 2027-28 ఆర్థిక సంవత్సరంలో ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన కింద నాలుగు సాగునీటి పథకాలకు రూ.5,856 కోట్ల నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్టు మంత్రి ఉత్తమ్ తెలిపారు.
ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి రాష్ట్రంలో పడిపోతున్న భూగర్భ జలమట్టాలపై కూడా ప్రధానికి వివరించామని, కేంద్ర భూగర్భ జలమండలి సెప్టెంబర్ నివేదికను అందజేశామని, భూగర్భ జలాల పెంపు, పరిరక్షణకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక కార్యాచరణ రూపొందిస్తున్నామని, అందుకోసం ప్రత్యేకంగా రూ.5 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని ప్రధానిని కోరినట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై ప్రధాని సానుకూలంగా స్పందించారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
‘ఖేలో ఇండియా’ లోగో.. మసట్ ఆవిషరణ
తెలంగాణ వేదికగా వచ్చే డిసెంబర్ 11వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న 8వ ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026’ అధికారిక లోగో, మసట్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదివారం ఆవిషరించారు. అనంతరం క్రీడా ఏర్పాట్లను కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని వివిధ జిల్లా కేంద్రాల్లో గేమ్స్ నిర్వహణకు స్టేడియంలు సిద్ధం చేశామని తెలిపారు.
27 క్రీడాంశాల్లో 7,000 మందికిపైగా క్రీడాకారులు పాల్గొంటారని, మూడేండ్లలోనే రాష్ట్ర క్రీడా బడ్జెట్‌ను రూ.113 కోట్ల నుంచి రూ.465 కోట్లకు పెంచామని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఇప్పటికే 61 మినీ స్టేడియంల నిర్మాణం పూర్తి కాగా, మరో 15 స్టేడియంల పనులు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సీఎం వెంట రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) ఏపీ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వీ శేషాద్రి, క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీ బాలాదేవి తదితరులున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

