కోల్కతా: జర్మనీలో రహస్యంగా పెళ్లి చేసుకున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra), బీజు జనతాదళ్ (బీజేడీ) నేత పినాకి మిశ్రా మరోసారి అందరిని ఆకట్టుకున్నారు. పాత బాలీవుడ్ క్లాసిక్ ‘రాత్ కే హమ్సఫర్’ పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేశారు. 1967 నాటి ‘యాన్ ఈవినింగ్ ఇన్ పారిస్’లోని రొమాంటిక్ సాంగ్కు వారిద్దరూ కలిసి స్టెప్పులేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, పశ్చిమబెంగాల్లో అధికారంలో ఉన్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, ఒడిశాకు చెందిన మాజీ ఎంపీ పినాకి మిశ్రా, మే 3న జర్మనీలోని బెర్లిన్లో చాలా సింపుల్గా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఈ జంట వెడ్డింగ్ కేక్ కట్ చేసింది. మహువా మొయిత్రా ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ప్రేమ, శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ చాలా కృతజ్ఞతతో ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
शादी के बाद महुआ मोइत्रा का शानदार डांस….. pic.twitter.com/6aHFZU1PGc
— Nidhi Yadav🇮🇳 ॥ धन्योऽस्मि भारतत्वेन ॥ (@Nydhyadav) June 8, 2025
Thank you everyone for the love and good wishes!! So grateful pic.twitter.com/hbkPdE2X7z
— Mahua Moitra (@MahuaMoitra) June 5, 2025
Also Read: