Taiwan Open : భారత అథ్లెట్లు తైవాన్ ఓపెన్ (Taiwan Open)లో పతకాల పంట పండించారు. శనివారం జ్యోతి ఎర్రాజీ, అబ్దుల్లా, పూజలు స్వర్ణాలతో మెరవగా.. పోటీల చివరి రోజైన ఆదివారం కూడా మరో నాలుగు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. మూడుసార్లు జాతీయ ఛాంపియన్ విథ్యా రామరాజ్(Vithya Ramaraj), రోహిత్ యాదవ్, పూజా, క్రిష్ణ కుమార్(Krishna Kumar)లు తమ తమ విభాగాల్లో పసిడితో గర్జించారు. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో యశాస్ పలాక్ష వెండి వెలుగులు విరజిమ్మాడు.
తైవాన్ చివరిరోజున భారత అథ్లెట్లు పసిడి మోత మోగించారు. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో వైథ్యా చిరుతలా పరుగెత్తి స్వర్ణం కొల్లగొట్టింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆమె 56.53 సెకన్లలోనే లక్ష్యానికి చేరుకుంది. తద్వారా త్వరలో జరుగబోయే వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో వైథ్య ర్యాంకింగ్స్ మెరుగవ్వనుంది. జావెలిన్ త్రోలో రోహిత్ అత్యుత్తమ ప్రదర్శన చేయకపోయినా 74.42 మీటర్ల దూరం ఈటెను విసిరి బంగారు పతకం సాధించాడు.
ROHIT YADAV WINS JAVELIN GOLD 🥇
With the best attempt of 74.42m, Rohit win Gold in Taiwan Athletics Open 2025 🏆#IndianAthletics #TaiwanOpen2025 #Athletics #javelinthrowpic.twitter.com/O29N78gQ71
— The Sports Feed (@thesports_feed) June 8, 2025
ఇక మహిళల, పురుషుల 800 మీటర్ల పరుగులో భారత అథ్లెట్లు అదరగొట్టారు. అంచనాలను అందుకుంటూ పూజ భారత్‌కే చెందిన ట్వింకిల్ చౌదరీని రెండో స్థానానికి పరిమితం చేస్తూ 2.02 79 సెకన్లలో ఫినిషింగ్ లైన్ దాటింది. పురుషుల ఫైనల్లో క్రిష్ణ కుమార్ ప్రత్యర్థులకు షాకిస్తూ 148 46 సెకన్లలోనే లక్ష్యానికి చేరుకొని గోల్డ్ మెడల్ ఖాతాలో వేసుకున్నాడు.
పది రోజుల క్రితం ఆసియా ఛాంపియన్షిప్స్(Asian Championships)లో స్వర్ణం సాధించిన జ్యోతి ఎర్రాజీ (Jhyothi Yarraji) మరోసారి మెరిసింది. 100 మీటర్ల హర్డిల్స్‌లో తనకు తిరుగులేదని చాటుతూ తైవాన్ ఓపెన్ లోనూ పసిడి వెలుగులు విరజిమ్మింది. శనివారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో చిరుతలా పరుగెత్తిన జ్యోతి 12.99 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. పురుషుల ట్రిపుల్ జంప్‌లో అబ్దుల్లా అబూబాకర్, మహిళల 1500 మీటర్ల పరుగులో పూజలు కూడా స్వర్ణంతో మనదేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేశారు.