Team India : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC 2025-27) కొత్త సైకిల్లో తొలి సిరీస్‌కు భారత జట్టు పక్కాగా సిద్ధమవుతోంది. ఇంగ్లండ్ గడ్డపై 18 ఏళ్లుగా చేజారుతున్న సిరీస్‌ను ఒడిసిపట్టేందుకు సమాయత్తమవుతోంది. ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టుల సిరీస్‌లో విజయమే లక్ష్యంగా పెట్టుకున్న టీమిండియా.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాక్టీస్ షురూ చేసింది. పర్యటన మొదలైన రెండో రోజే ఆటగాళ్లు కసరత్తు చేస్తూ కనిపించారు.
లార్డ్స్‌లోని ఇండోర్ స్టేడియంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) నేతృత్వంలో స్క్వాడ్‌లోని 15 మంది వామప్ వ్యాయామాలు, ఫీల్డింగ్ విన్యాసాలతో చెమటోడ్చారు. భారత క్రికెటర్ల ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను ఆదివారం బీసీసీఐ ఎక్స్‌లో షేర్ చేసింది.
𝗣𝗿𝗲𝗽 𝗕𝗲𝗴𝗶𝗻𝘀 ✅
First sight of #TeamIndia getting into the groove in England 😎#ENGvIND pic.twitter.com/TZdhAil9wV
— BCCI (@BCCI) June 8, 2025
ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా బృందం శనివారం ఇంగ్లండ్ చేరుకుంది. డబ్ల్యూటీసీలో కీలకమైన సిరీస్ కావడంతో బారత ఆటగాళ్లు మరుసటి రోజే శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. సిరాజ్, బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్‌లతో కూడిన పేస్ దళం వామప్ వ్యాయమాల తర్వాత బౌలింగ్ ప్రాక్టీస్‌తో బిజీగా గడిపింది. ఇక కెప్టెన్ గిల్, సిరాజ్, ప్రసిధ్‌లతో ఫుట్‌బాల్ ఆడుతూ కనిపించాడు. ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ సమక్షంలో క్యాచ్‌లు పట్టడం, బంతిని వికెట్లవైపు త్రో చేయడం, వికెట్లను గురి చూసి కొట్టడం వంటివి సాధన చేశారు.
భారత్, ఇంగ్లండ్‌ల మధ్య తొలి టెస్టు జూన్ 20 మొదలవ్వనుంది. అయితే.. అంతకంటే ముందు ఇంగ్లండ్‌లోనే ఉన్న ఏ జట్టుతో సీనియర్ టీమ్ నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఇంగ్లండ్ పరిస్థితులను అర్ధం చేసుకునేందుకు ఈ మ్యాచ్ చాలా ఉపయోగపడనుంది. కానీ, రికార్డులు మాత్రం ఆతిథ్య జట్టుకే అనుకూలంగా ఉన్నాయి. 2007లో చివరిసారిగా ఇక్కడ సిరీస్ గెలుపొందింది టీమిండియా. ఆ తర్వాత పలుమార్లు వెళ్లినా పరాజయమే పలకరించింది.
Touchdown UK 🛬#TeamIndia have arrived for the five-match Test series against England 🙌#ENGvIND pic.twitter.com/QK5MMk9Liw
— BCCI (@BCCI) June 7, 2025
కుర్రాళ్లు, సీనియర్లతో కూడిన భారత జట్టు ఈసారి 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలనే పట్టుదలతో ఉంది. అనుభవజ్ఞులైన విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ, అశ్విన్‌లు లేకుండా సిరీస్ విజయం కష్టమే. కానీ, అసాధ్యం కాదని చాటాలనుకుంటన్నాడు గంభీర్. ఇప్పటికే స్క్వాడ్‌లోని కేఎల్ రాహుల్ సెంచరీతో, కరుణ్ నాయర్ ద్విశతకంతో ఇంగ్లండ్ లయన్స్‌పై విరుచుకుపడ్డారు. సో.. వీళ్లు ఐదు టెస్టుల సిరీస్‌లో పరుగుల వరద పారించే అవకాశముంది.