Rinku-Priya Engagement | భారత క్రికెటర్ రింకు సింగ్, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ నిశ్చితార్థం వేడుక ఘనంగా జరిగింది. లక్నోలో ఆదివారం జరిగిన కార్యక్రమానికి కుటుంబీకులు, అత్యంత సన్నిహితులు మాత్రమే జరగ్గా.. పలువురు రాజకీయ నేతలు, క్రీడాకారులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వీరిద్దరి పెళ్లి ఈ నెల 18న జరుగనున్నది. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్-డింపుల్ యాదవ్ దంపతులు, ప్రముఖ నటి, ఎంపీ జయాబచ్చన్ హాజరై జంటను ఆశీర్వదించారు. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా హాజరయ్యారు.
ఈ సందర్భంగా శుక్లా మాట్లాడుతూ రింకు, ప్రియా ఇద్దరు తమతమ రంగాల్లో రాణిస్తున్నారని.. ఇద్దరు కలిసి విజయవంతమైన జంటగా నిలుస్తారన్నారు. వారిద్దరు ఆనందకరమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రియా సరోజ్ తండ్రి, ఎమ్మెల్యే తుఫానీ సరోజ్ మాట్లాడుతూ.. నిశ్చితార్థం కార్యక్రమానికి కుటుంబీకులు, బంధువులు, పలువురి స్నేహితుల సమక్షంలో జరిగిందన్నారు. రింకు – ప్రియా సింగ్ ఒకరినొకరు కొంతకాలం నుంచి పరిచయం ఉందని.. ప్రియా స్నేహితురాలి తండ్రి మాజీ క్రికెటర్ అని.. ఆయన ద్వారానే ఇద్దరికీ పరిచయం ఏర్పడిందన్నారు. ఇరు కుటుంబాల ఆశీస్సులతో ఇద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారన్నారు.
రింకు సింగ్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు రెండు వన్డేలు, 33 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో కేకేఆర్ జట్టులో సభ్యుడు. ఇక ప్రియా సరోజ్ ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన కర్ఖియాన్ గ్రామవాసి. ఆమె తండ్రి తూఫానీ సరోజ్ మూడుసార్లు ఎంపీగా, ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన వారసురాలిగా ప్రియా సరోజ్ మచిలీషహర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే ఎంపీగా గెలిచింది. బీజేపీ సీనియర్ నేతపై 35వేల ఓట్ల మెజారిటీతో గెలిచి దేశంలోనే అతిపిన్న వయస్కురాలైన ఎంపీలో ఒకరిగా నిలిచారు.
మట్టి కోర్టు.. మహారాణి గాఫ్.. నల్ల కలువదే ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్
ఇంగ్లండ్ చేరుకున్న టీమ్ఇండియా