మట్టి కోర్టు.. మహారాణి గాఫ్.. నల్ల కలువదే ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్
ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను అమెరికా యువ సంచలనం కోకో గాఫ్ గెలుచుకుంది. శనివారం ఫిలిప్పీ చార్టర్ కోర్టు వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో రెండో సీడ్ గాఫ్.. 6-7 (5/7), 6-2, 6-4తో టాప్ సీడ్ అరీనా సబలెంకపై విజయం సాధించి తన కెరీర్లో తొలి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
- ఫైనల్లో సబలెంకపై విజయం
- పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌కు సిన్నర్
మట్టి కోర్టులో కొత్త మహారాణి వచ్చింది. 21 ఏండ్ల అమెరికా యువ సంచలనం కోకో గాఫ్.. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేతగా నిలిచింది. ఫైనల్లో రెండో సీడ్ యూఎస్ అమ్మాయి.. ప్రపంచ ఒకటో ర్యాంకర్ అరీనా సబలెంకను మట్టికరిపించి ఈ టోర్నీలో కొత్త చరిత్ర సృష్టించింది. తొలి సెట్ ఓడినప్పటికీ ఏమాత్రం ఏకాగ్రత కోల్పోకుండా ఆడిన గాఫ్.. వరుస సెట్లలో తనకంటే మెరుగైన ర్యాంకు కలిగిన సబలెంకను చిత్తుచేసి ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి, కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకుంది.
పారిస్: ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను అమెరికా యువ సంచలనం కోకో గాఫ్ గెలుచుకుంది. శనివారం ఫిలిప్పీ చార్టర్ కోర్టు వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో రెండో సీడ్ గాఫ్.. 6-7 (5/7), 6-2, 6-4తో టాప్ సీడ్ అరీనా సబలెంకపై విజయం సాధించి తన కెరీర్లో తొలి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ప్రపంచ నెంబర్ 1, 2 మధ్య హోరాహోరీగా జరిగిన పోరులో తొలి సెట్ ఓడినప్పటికీ తర్వాత పుంజుకున్న ఈ అమెరికా అమ్మాయి.. 2015లో సెరెనా విలియమ్స్ తర్వాత యూఎస్ నుంచి ఈ టోర్నీలో విజేతగా గెలిచిన క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. రెండున్నర గంటల పాటు సాగిన పోరులో గాఫ్.. మొదటి సెట్ ఆరంభంలో కాస్త వెనుకబడ్డా తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. సబలెంక జోరుతో 4-1తో వెనుకబడ్డ ఆమె.. ఆ సెట్‌ను 6-7తో ముగించడంతో టైబ్రేక్‌కు దారితీసింది.
టైబ్రేక్ మొదట్లో 4 పాయింట్లు గెలిచినా.. సబలెంక తర్వాత పుంజుకోవడంతో గాఫ్‌కు నిరాశ తప్పలేదు. కానీ రెండో సెట్ నుంచి దూకుడు పెంచిన ఆమె.. ఆ సెట్‌ను అలవోకగా గెలుచుకుంది. 32 నిమిషాల్లోనే ముగిసిన రెండో సెట్లో వెనుకబడ్డ సబలెంక.. ఆ తర్వాత మ్యాచ్‌పై పూర్తిగా నియంత్రణ కోల్పోయింది. గాఫ్ జోరుతో ఆమె పదేపదే తన కోచింగ్ సిబ్బంది వైపు చూస్తూ అసహనానికి లోనైంది. మరోపక్క ప్రశాంతంగా ఉంటూ వరుసగా పాయింట్లను రాబట్టిన గాఫ్.. మూడో సెట్‌నూ తన ఖాతాలో వేసుకుని కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించింది.

2022లో ఇదే ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఓడిన గాఫ్.. మూడేండ్ల తర్వాత మళ్లీ ఇక్కడే ఎర్రమట్టి కోర్టు మహారాణిగా నిలవడం గమనార్హం. ఇక టోర్నీలో టైటిల్ ఫేవరెట్లలో ఒకరిగా నిలిచి సెమీస్‌లో పటిష్ట ప్రత్యర్థి ఇగా స్వియాటెక్‌ను ఓడించిన సబలెంక.. ఫైనల్లో మాత్రం గాఫ్ జోరు ముందు తలవంచక తప్పలేదు. మ్యాచ్‌లో 70 అనసవర తప్పిదాలు చేసిన ఆమె.. అందుకు భారీగా మూల్యం చెల్లించుకుంది.

జొకోకు షాక్
కెరీర్ 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం నొవాక్ జొకోవిచ్ మరికొంతకాలం వేచిచూడక తప్పేలా లేదు. ఫ్రెంచ్ ఓపెన్‌లో అయినా తన కలను నెరవేర్చుకోవాలని భావించిన ఈ సెర్బియా దిగ్గజానికి సెమీస్‌లో ఒకటో సీడ్ యానిక్ సిన్నర్ (ఇటలీ) షాకిచ్చాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ రెండో సెమీస్‌లో సిన్నర్.. 6-4, 7-5, 7-6 (7/3)తో జొకోను ఓడించి అతడి టైటిల్ ఆశలపై నీళ్లు చల్లాడు. వరుస సెట్లలో జొకోవిచ్‌ను ఓడించిన సిన్నర్.. ఈ టోర్నీలో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు చేరడం విశేషం. ఈ టోర్నీలో అతడికి ఇదే తొలి ఫైనల్. సెమీస్ విజయంతో సిన్నర్.. స్పెయిన్ కుర్రాడు అల్కరాజ్తో ఆదివారం టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాడు.
ప్రైజ్‌మనీ:
విజేత – రూ. 24.92 కోట్లు
రన్నరప్- రూ. 12.46 కోట్లు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

