లండన్: ఐదు టెస్టుల సిరీస్ కోసం శుక్రవారం ముంబై నుంచి బయల్దేరిన భారత జట్టు.. శనివారం ఇంగ్లండ్‌కు చేరుకుంది. కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో 2025-27 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ను ఆరంభించనున్న టీమ్ఇండియా.. జూన్ 20 నుంచి ఆతిథ్య జట్టుతో తొలి టెస్టులో తలపడనుంది.
టీమ్ఇండియా క్రికెటర్లు లండన్ విమానాశ్రయానికి చేరుకున్న వీడియోను బీసీసీఐ తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్ట్ చేసింది.