Chiru 157 | మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు. ఆయన ఇటీవల విశ్వంభర చిత్ర షూటింగ్ పూర్తి చేసి ఇప్పుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నాడు. డైరెక్టర్ వశిష్టతో చేసిన విశ్వంభర చిత్రం సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కుతుంది . ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా, కీరవాణి విశ్వంభరకు సంగీతం అందిస్తున్నాడు.అయితే విశ్వంభర సినిమాపై ఇప్పటి వరకు ఎటువంటి అప్ డేట్ రాలేదు. కాని ఇటీవల మొదలైన అనిల్ రావిపూడి సినిమా మాత్రం పరుగులు పెడుతోంది. ఇక ఈసినిమా స్టార్ట్ అయిన అప్పటి నుంచి నిత్యం ఏదో ఒక వార్త టాలీవుడ్లో హల్చల్ చేస్తూనే ఉంది.
ఈ మూవీ ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుండగా, మరి కొద్ది రోజులలో రెండో షెడ్యూల్ మొదలు పెట్టనున్నారట. చిరంజీవి కెరీర్లో 157వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్లో చిరంజీవి డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారనే వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అయింది. రెండు పాత్రలలో ఒక పాత్ర వింటేజ్ చిరంజీవిని గుర్తు చేసేలా ఉంటుందని, మరో పాత్ర ఫుల్ యాక్షన్ మోడ్లో ఉంటుందట. అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కాని టాలీవుడ్ సర్కిల్ లో మాత్రం ఈ రూమర్ షికారు చేస్తోంది.ఇప్పుడు నయనతార , చిరంజీవిపై ఫ్యామిలీ సీన్స్ చిత్రీకరిస్తున్నాడట అనీల్ రావిపూడి.
వారిద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్స్ చాలా బాగా వచ్చాయని అంటున్నారు. ఈ సీన్స్ సినిమాకి హైలైట్ అవుతాయని అంటున్నారు. ఈ సినిమాను సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిరంజీవి గత సినిమాలన్నీ యాక్షన్ డ్రామాలు కాగా, ఈసారి ప్యూర్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ తో పాటు, కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగా157 సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, ఆయన ఈ మూవీ కోసం అద్భుతమైన బాణీలు రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది.