IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ కొత్త షెడ్యూల్ రాకతో అన్ని ఫ్రాంజైజీలు మ్యాచ్‌ల సన్నద్ధతలో మునిగిపోయాయి. పైగా ప్లే ఆఫ్స్ బెర్తులను నిర్ణయించే కీలక మ్యాచ్‌లు మే 17 నుంచి జరుగనున్నాయి. దాంతో, రేసులో ఉన్న జట్లు తమ వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నాయి. అయితే.. విదేశీ క్రికెటర్ల(Foreign Players) గురించే ఇప్పుడు అందరికి బెంగ పట్టుకుంది. భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ వాయిదా పడడంతో స్వదేశాలకు వెళ్లిపోయారు చాలామంది. వీళ్లలో తిరిగి భారత్‌కు వచ్చేది ఎవరు? .. హ్యాండ్ ఇచ్చేది ఎవరు? అనేది తెలియాల్సి ఉంది.
ఒకవేళ విదేశీ క్రికెటర్లు ఐపీఎల్ ఆడేందుకు సుముఖంగా లేకుంటే పలు ఫ్రాంచైజీల విజయావకాశాలు దెబ్బతినడం ఖాయం. మరీ ముఖ్యంగా లీగ్‌లో ఇప్పటివరకూ ఆస్ట్రేలియన్లనే నమ్ముకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళురు (RCB)కు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ప్రధాన పేసర్ జోష్ హేజిల్‌వుడ్(Josh Hazlewood), యువ హిట్టర్ టిమ్ డేవిడ్‌లు పటిదార్ బృందానికి ఎంతో కీలకం. కానీ, వీళ్లు ఇప్పుడు స్వదేశంలో ఉన్నారు. హేజిల్‌వుడ్‌కు గాయం కాగా.. డేవిడ్ రాకపై సందేహాలు నెలకొన్నాయి. పంజాబ్ కింగ్స్ (Punjab Kings)లోని మార్కస్ స్టోయినిస్ అందుబాటులో ఉంటాడా? లేదా తెలియదు. ఆ జట్టు పేసర్ మార్కో యాన్సెస్, ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్‌లు దుబాయ్ నుంచి భారత్ రావాల్సి ఉంది.
రబడ, హెడ్, యాన్సెన్
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ పేస్ అస్త్రం మిచెల్ స్టార్క్(Mitchell Starc).. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins), ఓపెనర్ ట్రావిస్ హెడ్(Travis Head)లు సైతం స్వదేశంలో ఉండిపోయారు. వీళ్లు.. మళ్లీ జట్టుతో కలుస్తారా? లేదా? అని ఆరెంజ్ ఆర్మీ కంగారు పడుతోంది. గుజరాత్ టైటన్స్ పేసర్లు కగిసో రబడ (Kagiso Rabada), గెరాల్డ్ కొయెట్జీలు దక్షిణాఫ్రికా నుంచి వస్తారా? అనేది సందేహమే. అందుకు కారణం.. జూన్ 11న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC) ఫైనల్ ఉంది. దాంతో, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా కీలక ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరం అయ్యే అవకాశం ఉంది.
అయితే.. క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం తమ ఆటగాళ్లను అడ్డుకోమని చెబుతోంది. ఐపీఎల్లో ఆడేందుకు సిద్ధమైన వాళ్లను భారత్‌కు పంపేందుకు అభ్యంతరం చెప్పమని ఆసీస్ బోర్డు హామీ ఇస్తోంది. కాకపోతే డబ్ల్యూటీసీ ఫైనల్‌ను దృష్టిలో పెట్టుకొని ఆటగాళ్లపై వర్క్‌లోడ్ పడకుండా చూసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కమిన్స్, హెడ్లు ఐపీఎల్ 18వ సీజన్ తదుపరి మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఈ సీజన్లో తీవ్రంగా నిరాశపరిచిన హైదరాబాద్ జట్టుకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలున్నాయి. మే 19న లక్నో సూపర్ జెయింట్స్‌తో, మే 25న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో కమిన్స్ సేన తలపడనుంది.
Now streaming: 𝘍𝘢𝘴𝘵 & 𝘍𝘶𝘳𝘪𝘰𝘶𝘴 ⚡🍿 pic.twitter.com/3YThDr8NoI
— Gujarat Titans (@gujarat_titans) May 13, 2025
ఆర్సీబీ స్క్వాడ్‌లోని లివింగ్‌స్టోన్, లుంగి ఎంగిడి(Lungi Ngidi), నువాన్ తుషారలు తిరిగి జట్టుతో కలిసేందుకు రెడీగా ఉండడం ఆ జట్టుకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తోంది. గుజరాత్ పేసర్లు రబడ, కొయెట్జీ, వికెట్ కీపర్ జోస్ బట్లర్లు సైతం లీగ్ మ్యాచ్‌లు ఆడేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని సమాచారం. అదే జరిగితే టైటిల్ వేటలో ఉన్న శుభ్‌మన్ గిల్(Shubman Gill) బృందానికి తీపి కబురే.
🗓️ #TATAIPL 2025 action is all set to resume on 17th May 🙌
The remaining League-Stage matches will be played across 6⃣ venues 🏟️
The highly anticipated Final will take place on 3rd June 🏆
Details 🔽https://t.co/MEaJlP40Um pic.twitter.com/c1Fb1ZSGr2
— IndianPremierLeague (@IPL) May 12, 2025