BRS leaders | ధర్మారం, మే 13 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి లో మంగళవారం నిర్వహించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవం సందర్భంగా స్వామివారిని స్థానిక బీఆర్ఎస్ నాయకులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ కార్యక్రమంలో నంది మేడారం సింగిల్ విండో చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, పార్టీ నాయకులు పాకాల రాజయ్య గౌడ్, మిట్ట తిరుపతి, బెల్లాల లక్ష్మణ్ ప్రసాద్, దాడి సదయ్య, ఆవుల శ్రీనివాస్, ఆవుల వేణుగోపాల్, రెడపాక శ్రీనివాస్, అడువాల రవి, అపర్ణ, మమత తదితరులు పాల్గొన్నారు.