Road accident | లారీని ఢీ కొట్టిన బైక్, వ్యక్తి మృతి.. తొర్రూరులో ఘటన
Road accident | లారీ, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది.
మహబూబాబాద్ : లారీ, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పర్వతగిరి మండలం ఈదులగడ్డ తండాకు చెందిన ధరావత్ రామ్దన్ (45) మంగళవారం తన ద్విచక్ర వాహనంపై తొర్రూరు నుండి తిరుమలగిరి వైపు డీకే తండాకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ముందుగా వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో రామ్ దన్ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నాడు.
ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య మంగమ్మతో పాటు ముగ్గురు కుమారులు శ్రీధర్, మధుకర్, సతీష్, ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వర్ధన్నపేట ఏరియా దవాఖానకు తరలించారు. బాధితుని పెద్ద కుమారుడు శ్రీధర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ ఉపేందర్ తెలిపారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

