నల్లగొండ విద్యా విభాగం (రామగిరి), మే 13 : పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సులో ప్రవేశానికి తెలంగాణ సాంకేతిక విద్య మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన టీజీ పాలీసెట్- 2025 ప్రవేశ పరీక్ష మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 25 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు.
– నల్లగొండ జిల్లాలో పరీక్షల జిల్లా కో ఆర్డినేటర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ నరసింహారావు పరీక్షలను పర్యవేక్షించారు. సూర్యాపేట జిల్లాలో జిల్లా కో ఆర్డినేటర్, ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కె.సుజాత, సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో జరిగిన పరీక్షను ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల తిరుమలగిరి ప్రిన్సిపాల్ కె.సత్తయ్య అలాగే యాదగిరిగుట్ట జిల్లాలో జరిగిన పరీక్షలను జిల్లా కో ఆర్డినేటర్ వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు.
– నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన 11 పరీక్ష కేంద్రాలలో 5,203 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 4,750 హాజరయ్యారు. 480 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. వీరిలో 2,501 మంది బాలికలకు గాను 2,278 మంది, 2,702 బాలురకు గాను 2,472 మంది హాజరయ్యారు.
– సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేసిన ఏడు పరీక్ష కేంద్రాల్లో 2,798 మంది విద్యార్థులకు 2,590 విద్యార్థులు హాజరు కాగా 208 మంది గైర్హాజరయ్యారు. వీరిలో 1,362 మంది బాలికలకు 1,260 మంది, 1,436 బాలురకు 1,330 మంది హాజరయ్యారు.
– సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరిలో నిర్వహించిన పరీక్ష కేంద్రంలో 350 మందికి 321 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో బాలురు 190 మందికి 170 మంది హాజరుకాగా, 160 మంది బాలికలకు 140 మంది హాజరయ్యారు.
– యాదగిరిగుట్ట జిల్లాలో యాదగిరిగుట్టలో రెండు, భువనగిరిలో నాలుగు కేంద్రాల్లో 1,754 మంది విద్యార్థులకు గాను 1,664 మంది విద్యార్థులు హాజరుకాగా 90 మంది గైర్హాజరయ్యారు. వీరిలో 844 మంది బాలికలకు 794 మంది, 910 బాలురకు 870 మంది హాజరయ్యారు.
Nalgonda : ఉమ్మడి నల్లగొండలో సజావుగా పాలీసెట్.. 9,625 మంది విద్యార్థులు హాజరు