INDW vs ENGW : లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. భారత్ నిర్దేశించిన స్వల్ప ఛేదనలో ధనాధన్ ఆడుతున్న ఓపెనర్ టమ్మీ బ్యూమంట్(34) వెనుదిరిగింది. బౌండరీలతో రెచ్చిపోతున్న ఆమెను స్నేహ్ రానా ఎల్బీగా ఔట్ చేసింది. దాంతో, 51 పరుగుల వద్ద ఆతిథ్య జట్టు మొదటి వికెట్ పడింది. ప్రస్తుతం అమీ జోన్స్(24), కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్(4)లు క్రీజులో ఉన్నారు. 12 ఓవర్లకు స్కోర్.. 64/1. ఇంకా ఇంగ్లండ్ విజయానికి 80 రన్స్ కావాలి.
వర్షం కారణంగా ఓవర్లు కుదించిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. స్మృతి మంధాన(42) చెలరేగినా.. మిడిలార్డర్ దారుణంగా విఫలమైంది. లార్డ్స్ మైదానంలో ఆతిథ్య జట్టు బౌలర్లు చెలరేగగా టీమిండియా ప్రధాన ప్లేయర్లు కనీసం రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. మంధాన ఔటయ్యాక దీప్తి శర్మ(30), అరుంధతి రెడ్డి(14)లు పోరాడడంతో హర్మన్‌ప్రీత్ సేన నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేయగలిగింది.
Innings Break!
Crucial knocks from Vice-Captain Smriti Mandhana (42) and Deepti Sharma (30*) help #TeamIndia set a target of 144 in front of England🎯
Over to our bowlers now!
Updates ▶️ https://t.co/ZeObbnYqoK#ENGvIND pic.twitter.com/oEwEoX9RhN
— BCCI Women (@BCCIWomen) July 19, 2025