Hansika | టాలీవుడ్ బ్యూటీ హన్సిక మోత్వానీ వార్తల్లో నిలిచారు. భర్తతో విడాకులు తీసుకోబోతుందని వార్తలు వైరల్ అయ్యాయి. రెండేళ్ల కిందట వ్యాపారవేత్త సోహైల్ కతురియాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవల వైవాహిక జీవితంలో విభేదాలు నెలకొన్నాయని.. ఈ క్రమంలోనే విడాకులు తీసుకోబోతున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే ఇద్దరు విడివిడిగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే సోహైల్ కతురియా స్పందించారు. ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ వీడాకులపై మౌనం స్పందించారు. విడాకులపై వస్తున్న పుకార్లను తోసిపుచ్చారు. కానీ, హన్సిక మాత్రం ఇప్పటి వరకు ఈ అంశంపై స్పందించలేదు. హన్సిక మోత్వానీ తన తల్లితో కలిసి జీవిస్తోందని.. ఆమె భర్త ప్రస్తుతం తన తల్లిదండ్రులతో నివరిస్తున్నాడని ప్రచారం జరిగింది.
డిసెంబర్ 2022లో ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఇద్దరూ మొదట్లో కలిసే జీవించారని.. ఆ తర్వాత ఇద్దరి మధ్య సఖ్యత కుదరకపోవడంతో ఒకే భవనంలో వేర్వేరు అపార్ట్మెంట్లలో జీవిస్తూ వచ్చారని.. ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్య విభేదాలు తొలగిపోలేదని వార్తలు వచ్చాయి. తాజాగా సోహైల్ మాత్రం అందులో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. అయితే, వేర్వేరుగా ఉంటున్నారా? జీవిస్తున్నారా? అన్నదానికి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. హన్సిక-సోహైల్ ఇద్దరు డిసెంబర్ 4, 2022న జైపూర్‌లో వివాహం చేసుకున్నారు. ప్రతి ఏడాది పెళ్లి రోజున స్పెషల్ ఫొటోస్ హన్సిక షేర్ చేస్తూ వస్తుంది. గతేడాది డిసెంబర్లో సైతం సెకండ్ యానివర్సరీ అంటూ ఓ పోస్ట్ పెట్టింది. అయితే, ప్రస్తుతం విడాకుల వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారంపై స్పందించాల్సి ఉంది. గతంలో సోహైల్ హన్సిక చిన్ననాటి ఫ్రెండ్ రింకీ బజాజ్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి వేడుకకు హన్సిక సైతం హాజరైంది. కానీ, ఆ బంధం ఎక్కువ రోజులు నిలువలేకపోయింది.
ఆ తర్వాత సోహైల్‌కు హన్సిక దగ్గరైంది. కొద్దిరోజులకు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన విశేషాలను సైతం ‘లవ్ షాదీ డ్రామా వీడియో’ పేరుతో ఓటీటీలోనూ రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా.. హన్సిక మోత్వానీ 2003లో బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది. 2007లో తెలుగు సినిమా ‘దేశ ముదురు’తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హిందీ, తమిళం, చిత్రాల్లోనూ నటించింది. చివరిసారిగా తెలుగులో 105 నిమిషాలు మూవీలో నటించింది. ప్రస్తుతం హన్సిక చేతిలో నాలుగు చిత్రాలున్నాయి. తమిళంలో రౌడీ బేబి, మ్యాన్, గాంధారి, హిందీలో లవ్ ఎఫైర్ చిత్రాల్లో నటిస్తున్నది.