Ishan Kishan : మోడల్స్, సినిమా హీరోయిన్లతో క్రికెటర్లు ప్రేమలో పడడం కొత్తేమీ కాదు. గాసిప్స్‌తో మొదలైన తమ జర్నీని పెళ్లి పీటల వరకూ తీసుకెళ్లిన జంటలూ ఉన్నాయి. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలు ఇలానే డేటింగ్ చేసి సినీ సెలబ్రిటీలను మనువాడారు. ఈ జాబితాలో యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) కూడా చేరినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. అవును.. తన విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించే ఇషాన్ లవ్‌లో పడ్డాడట. అది కూడా మోడల్, మిస్ దివా అదితీ హుందియా (Aditi Hundia)తో ఈ యంగ్ ఓపెనర్ రొమాన్స్ చేస్తున్నాడనే వార్తలు వైరలవుతున్నాయి. అయితే.. అటు ఇషాన్గానీ, అదితీగానీ తాము రిలేషన్షిప్లో ఉన్నామనే విషయాన్ని ఇప్పటివరకైతే అధికారికంగా వెల్లడించలేదు.
దూకుడైన ఆటతో శుభారంభాలు ఇచ్చే ఇషాన్ గురించి మనకు తెలిసిందే. కానీ, అదితి గురించి తెలిసింది తక్కువ. సో.. ఆమె విషయానికి వస్తే.. 2018లో మిస్ దివా టైటిల్ గెలుచుకుంది. ఐపీఎల్ సమయంలో వీళ్ల మధ్య పరిచయం ఏర్పడిందని జీ న్యూస్ కథనం పేర్కొంది. క్రికెట్ మ్యాచ్‌లను చూసే అదితి ముంబై ఇండియన్స్‌కు ఫ్యాన్. 2019 ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించిందీ బ్యూటీ.
అంతేకాదు స్టాండ్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆమె ‘మిస్టరీ ఎంఐ ఫ్యాన్ గర్ల్’గా అప్పట్లో వైరలైంది. అప్పటి నుంచే ఇషాన్, అదితిల మధ్య మాటలు మొదలయ్యాయని సమాచారం. అలా స్టార్ట్ అయిన వీళ్ల జర్నీ సోషల్ మీడియా కామెంట్లతో మరింత ముందుకు సాగింది.
ఏడాది క్రితం ఇషాన్.. రెడిట్ పోస్ట్‌లో అదితిని ఉద్దేశించి బ్యూటిఫుల్ అని కామెంట్ల చేశాడు. దాంతో, వీళ్లు లవ్‌లో ఉన్నారనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే.. ఈ మధ్యే ఇరువురు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేశారు. అంటే.. డేటింగ్‌కు ఎండ్ కార్డ్ పడిందా? లేదంటే అనవసరమైన గాసిప్స్ కారణంగా తమ రిలేషన్షిప్ బయటపడుతుందని ఇద్దరూ ఇలా చేశారా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇక ఇషాన్ విషయం మనందరికీ తెలిసిందే.
అదితీ హుందియా, ఇషాన్
నిరుడు దక్షిణాఫ్రికా పర్యటనలో అలిగి సిరీస్ మధ్యలోనే స్వదేశం వచ్చిన ఈ చిచ్చరపిడిగు.. రంజీల్లో ఆడనందుకు సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాడు. బీసీసీఐ ఇచ్చిన షాక్‌తో తేరుకున్న ఇషాన్ దేశవాళీలో ఆడి ఫామ్ చాటుకున్నాడు. ఐపీఎల్ 18వ సీజన్లో సన్‌రైజర్స్ తరఫున తొలి మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. ఈ టోర్నీలో మొదటి శతకంతోమెరిసిన అతడు ఆ తర్వాత వరుసగా విఫలమయ్యాడు.