కోదాడ, జూలై 19 : ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చాలని, భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదగాలని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కాకతీయ కమ్మ సంఘం అధ్యక్షుడు ఎర్నేని వెంకటరత్నం బాబు విద్యార్థులకు సూచించారు. శనివారం కోదాడ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించిన విద్యార్థులకు ఆర్థిక సాయం అందించి మాట్లాడారు. పదో తరగతి పరీక్షలో జిల్లా ప్రథమ ర్యాంక్ సాధించి ట్రిపుల్ ఐటీ సీటు పొందిన తాళ్లూరి రేఖశ్రీ కి రూ.5 వేలు, అలాగే త్రిబుల్ ఐటీ సీటు సాధించిన నరేంద్రకు రూ.5 వేల చొప్పున నగదు బహుమతి అందించారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ సలీం షరీఫ్, విశ్రాంత హెచ్ఎం ముత్తవరపు రామారావు, ఎర్రవరం పీఏసీఎస్ చైర్మన్ నల్లజాల శ్రీనివాసరావు, రెడ్లకుంట మాజీ సర్పంచ్ సాదినేని అప్పారావు, మల్లెల పుల్లయ్య, సాతులూరు హనుమంతరావు, రావెళ్ల కృష్ణారావు, వేమూరు విద్యాసాగర్, లైటింగ్ ప్రసాద్, వేమూరు రామయ్య, పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం డి.మార్కండేయ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.