Bonala festival | మారుతి నగర్ జులై 19 : మెట్పల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాల ఆధ్వర్యంలో తెలంగాణ బోనాల పండుగ శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలంగాణ సాంప్రదాయ దుస్తులతో బోనాలను నెత్తిన పెట్టుకొని మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి సమర్పించారు.
చిన్నారులు పాత బస్టాండ్ లో చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పోతురాజు విన్యాసాలు, పులి వేషధారణలో చిన్నారులు ఆహుతలను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మాజీ జడ్పీటీసీ భారతి, ప్రజాప్రతినిధులు, పాఠశాల కరస్పాండెంట్ రమేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.