Smriti Mandhana : అంతర్జాతీయ క్రికెట్లో రికార్డ్ బ్రేకర్‌గా పేరొందిన స్మృతి మంధాన (Smriti Mandhana) అంటే బౌలర్లకు హడల్. ఇంగ్లండ్ పర్యటనలో తన విధ్వంసక ఆటతో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ ఓపెనర్.. లవ్ లైఫ్‌ను కూడా ఎంజాయ్ చేస్తోంది. బాలీవుడ్ సింగర్ పలాశ్ ముచ్చల్ (Palash Muchhal)తో పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ సొగసరి క్రికెటర్ అతడికి హార్ట్ ఎమోజీస్ పంపింది.
అసలేం జరిగిందంటే.. శనివారం (జూలై 19న) ఈ డాషింగ్ ఓపెనర్ 29వ వసంతంలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పలాశ్ ఆమెకు పుట్టిన రోజున శుభాకాంక్షలు తెలిపాడు. మనసైన వ్యక్తి నుంచి విషెస్ అందుకున్న మంధాన.. నువ్వే హార్ట్ బీట్ అనే ఉద్దేశం వచ్చేలా ‘థ్యాంక్యూ మై బాయ్’ అనే పోస్ట్‌కు లవ్ ఎమోజీలతో బదులిచ్చింది.
మంధాన, పలాశ్లు కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నిరుడు మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో మంధాన సారథ్యంలోని ఆర్సీబీ (RCB) టైటిల్ విజేతగా అవరించింది. అనంతరం మైదానంలో బెంగళూరు జట్టు సంబురాలు చేసుకుంది. ఆ సమయంలో పలాశ్, మంధాన జంటగా కంటపడ్డారు. ఇలా ఒకరికొకరు మద్దుతగా ఉంటూ కెరీర్లో రాణిస్తున్న ఈ జోడీ.. ప్రత్యేక సందర్భాల్లో తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటుంది. మంధాన జన్మదినం సందర్భంగా పలాశ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు.
అందులో.. ‘మన ప్రయాణం మొదలైనప్పటి నుంచి నువ్వే నా ప్రశాంతత. నా కన్ఫ్యూజన్ కూడా. అంతేకాదు నా బిగ్గెస్ట్ చీర్ లీడర్ నువ్వే. నాలో స్ఫూర్తిని నింపేది కూడా నీవే. ఒత్తిడిలోనూ కూల్‌గా ఉండడం నుఇన్ను చూసే నేర్చుకున్నా. హ్యాపీ బర్త్ డే స్మృతీ’ అంటూ తన ప్రేమ సందేశాన్ని రాసుకొచ్చాడు. ఇష్ట సఖుడు కొండంత ప్రేమ కురిపించగా.. మంధాన కూడా అతడికి లవ్ ఎమోజీలతో నువ్వే నా సర్వస్వం అని సమాధానమిచ్చింది.