నకిరేకల్, జూలై 19 : 2025-26 విద్యా సంవత్సరానికి గాను నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను అతిథి అధ్యాపకులతో భర్తీ చేయనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బెల్లి యాదయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మ్యాథ్స్-1, జువాలజీ-1, కామర్స్-2, కంప్యూటర్ సైన్స్-1, మొత్తం 5 ఖాళీలున్నట్లు వెల్లడించారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ 55 శాతం మార్కులున్న జనరల్ అభ్యర్థులు, 50 శాతం మార్కులు ఉన్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. పీహెచ్డీ, నెట్, సెట్ అర్హతలున్న వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 25 సాయంత్రం 5 గంటలలోగా కళాశాల కార్యాలయంలో స్వయంగా అందజేయాలని సూచించారు. ఇంటర్య్వూ తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.