Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాచిగూడ-మధురై, హైదరాబాద్-కొల్లం, హైదరాబాద్- కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఉన్న రద్దీని దృష్టిలో పెట్టుకొని స్పెషల్ రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కాచిగూడ-మధురై (07191) రైలును ఆగస్టు 18 నుంచి అక్టోబర్ 13 వరకు ప్రతి సోమవారం రాకపోకలు సాగిస్తున్నట్లు చెప్పింది. మధురై – కాచిగూడ (07192) రైలు ఆగస్టు 20 నుంచి అక్టోబర్ 15 వరకు ప్రతి బుధవారం రైలు అందుబాటులో ఉండనుందని పేర్కొంది.
హైదరాబాద్ – కొల్లం (07193) రైలు ఆగస్టు 16 నుంచి అక్టోబర్ 10 వరకు ప్రతి శనివారం.. కొల్లం -హైదరాబాద్ (07194) రైలు ఆగస్టు 18 నుంచి అక్టోబర్ 13 వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుందని చెప్పింది. ఇక హైదరాబాద్ కన్యాకుమారి (07230) ఆగస్టు 13 నుంచి అక్టోబర్ 8 వరకు ప్రతి బుధవారం.. కన్యాకుమారి – హైదరాబాద్ (07229) రైలు ఆగస్టు 18 నుంచి అక్టోబర్ 10 వరకు ప్రతి శుక్రవారం రాకపోకలు సాగిస్తుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.