Smriti Mandhana | భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) తండ్రి శ్రీనివాస్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం గుండెపోటు లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, తాజాగా ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శ్రీనివాస్ ఆరోగ్యం మెరుగుపడటంతో ఆయన్ను డిశ్చార్జ్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.
ఆదివారం స్మృతి-పలాశ్ వివాహం జరగనుండగా.. క్రికెటర్ తండ్రి హఠాత్తుగా అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీంతో పెళ్లిని వాయిదా వేశారు. ఆ తర్వాత కాసేపటికే స్మృతి మంధానకు కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ (Palash Muchhal) కూడా అస్వస్థకు గురి కావడంతో సాంగ్లీలోని ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. మంగళవారం మరోసారి అస్వస్థతకు గురికావడంతో పలాశ్ను కుటుంబ సభ్యులు ముంబైలోని ఆసుపత్రిలో చేర్పించారు. ఇక ఇప్పుడు స్మృతి తండ్రి డిశ్చార్జ్ కావడంతో పెళ్లి డేట్పై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read..
Palash Muchhal | మళ్లీ ఆసుపత్రిలో చేరిన స్మృతి మంధానకు కాబోయే భర్త
Smriti Mandhana | స్మృతి మంధాన-పలాశ్ వివాహం ప్రస్తుతానికి నిలిపివేశారు : పలాక్ ముచ్చల్
Mumbai Terror Attack | ముంబై మారణహోమానికి 17 ఏండ్లు