Mumbai Terror Attack | ముంబై మారణహోమానికి 17 ఏండ్లు
Mumbai Terror Attack | భారత చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటైన ముంబై ఉగ్రదాడి జరిగి నేటికి సరిగ్గా 17 ఏండ్లు పూర్తయింది.
Mumbai Terror Attack | భారత చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటైన ముంబై ఉగ్రదాడి జరిగి నేటికి సరిగ్గా 17 ఏండ్లు పూర్తయింది. 2008 నవంబర్ 26న పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలో మారణహోమానికి పాల్పడ్డారు. ఈ దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. నాటి చీకటి రోజును భారతీయులు ఎప్పటికీ మర్చిపోలేరు. నాటి చీకటి రోజును పలువురు గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
సముద్ర మార్గం ద్వారా ముంబైలోకి ప్రవేశించిన పాకిస్థానీ ఉగ్రవాదులు.. నగరంలో మారణహోమాన్ని సృష్టించారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, ముంబై చాబాద్ హౌస్, నారిమన్ హౌస్, కామా హాస్పిటల్ తదితర ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు. 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ దాడిలో అనేక మంది గాయపడ్డారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో తొమ్మిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
17 ఏండ్ల క్రితం అంటే 2008 నవంబర్ 26న పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలో మారణహోమానికి పాల్పడ్డారు. కొబాలా సముద్ర తీరం వెంబడి దక్షిణ ముంబైలోకి ప్రవేశించిన ఈ ముఠా తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ సహా అనేక ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులు జరిపారు. ఈ దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి అజామ్ ఛీమా కీలక సూత్రధారిగా గుర్తించారు.
దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులకు అజామ్ శిక్షణ ఇచ్చినట్లు అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాది కసబ్‌ను సజీవంగా పట్టుకున్నారు. కోర్టు ఉరి శిక్ష విధించడంతో 2012 నవంబర్ 21న పూణేలోని ఎరవాడ జైలులో ఉరి తీశారు. 26/11 పేలుళ్ల ఘటన మాత్రమే కాకుండా ఇతర బాంబు పేలుళ్లకు కూడా అజామ్ సూత్రధారిగా వ్యవహరించారు. 2006లో ముంబై రైళ్లలో జరిగిన బాంబు పేలుడు వెనుక అతని హస్తం ఉందని అప్పట్లో తేల్చారు. ఈ పేలుళ్లలో 188 మంది ప్రాణాలు కోల్పోగా.. 800 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు.
Also Read..
Nirmala Gavit | మాజీ ఎమ్మెల్యేపైకి దూసుకెళ్లిన కారు
Kali Mata: కాళీమాత విగ్రహానికి మేరీమాత అలంకరణ.. ఆలయ పూజారి అరెస్టు
Delhi | ఢిల్లీ పటేల్‌నగర్‌లో కాల్పులు.. నిందితుడికి గాయాలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

