Nirmala Gavit | మహారాష్ట్ర నాసిక్ (Nashik)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. శివసేన (Shiv Sena) పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నిర్మలా గవిట్ (Nirmala Gavit)పైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన షాకింగ్ దృష్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
నిర్మలా గవిట్ తన మనవడితో కలిసి రోడ్డుపక్కన వాకింగ్ చేస్తోంది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన కారు ఆమెను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో నిర్మలా గవిట్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఘటనకు సంబంధించిన దృష్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
Also Read..
Kali Mata: కాళీమాత విగ్రహానికి మేరీమాత అలంకరణ.. ఆలయ పూజారి అరెస్టు
Delhi | ఢిల్లీ పటేల్‌నగర్‌లో కాల్పులు.. నిందితుడికి గాయాలు
Pension | పెన్షన్ కోసం మూడేళ్లుగా చనిపోయిన తల్లిలా వేషం వేసిన కొడుకు