IND vs ENG : ఓవల్ టెస్టులో పుంజుకున్న భారత బౌలర్లు వికెట్ల వేట కొనసాగిస్తున్నారు. లంచ్ తర్వాత ప్రసిధ్.. ఓపెనర్ జాక్ క్రాలే(64)ను బోల్తా కొట్టించగా.. సిరాజ్ ఓవర్లో ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్(22) ఔటయ్యాడు. ఎల్బీకి సిరాజ్ అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. కచ్చితంగా వికెట్టే అని సిరాజ్ నమ్మకంగా చెప్పగా కెప్టెన్ గిల్ అయిష్టంగానే రివ్యూ తీసుకున్నాడు. కానీ, రీప్లేలో బంతి లెగ్ స్టంప్‌ను తాకినట్టు చూపింది.
అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకొని ఔట్ అని ప్రకటించగా సిరాజ్ మియా సింహగర్జన చేశాడు. భారత ఆటగాళ్లు కూడా సంబురాల్లో మునిగిపోయారు. ప్రస్తుతం జో రూట్ (16 నాటౌట్), హ్యారీ బ్రూక్(7 నాటౌట్)లు ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో ఉన్నారు. మూడు వికెట్ల నష్టానికి 161 రన్స్ కొట్టిన ఆతిథ్య జట్టు ఇంకా 63 పరుగులే వెనుకంజలో ఉంది.
Decision overturned! 🙌
A successful review for #TeamIndia and Mohd. Siraj gets Ollie Pope 👏👏
Updates ▶️ https://t.co/Tc2xpWNayE#ENGvIND | @mdsirajofficial pic.twitter.com/XdVjfec6yW
— BCCI (@BCCI) August 1, 2025
భోజన విరామం తర్వాత భారత బౌలర్లు పుంజుకోవడంతో జాక్ క్రాలే(64) పెవిలియన్ చేరాడు. అర్ధ శతకం తర్వాత జోరు పెంచిన క్రాలేను ప్రసిధ్ కృష్ణ వెనక్కి పంపాడు. ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న షార్ట్ బంతిని గాల్లోకి లేపిన ఓపెర్ జడ్డూ చేతికి దొరికాడు. దాంతో రెండో వికెట్ విలువైన భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే జో రూట్(16 నాటౌట్) జతగా జట్టును ఆదుకోవాలనుకున్న ఓలీ పోప్(22) నిదానంగా ఆడాడు. 16 పరుగుల వద్ద స్లిప్‌లో సాయి సుదర్శన్ క్యాచ్ జారవిడువడంతో బతికిపోయిన పోప్.. చివరకు సిరాజ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.