రామవరం, ఆగస్టు 01 : గత నెల 30న జరిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో సబ్ జూనియర్ బాలుర విభాగంలో చుంచుపల్లి మండలం, ధన్బాద్ గ్రామ పంచాయతీలో గల సెయింట్ జోసెఫ్ హై స్కూల్ విద్యార్థి ఎస్కే అర్హాన్ అలీ (9వ తరగతి) బంగారు పతకం సాధించాడు. ఈ సందర్భంగా విద్యార్థిని స్కూల్ ప్రిన్సిపాల్ ఎస్కే అర్హాన్ శుక్రవారం అభినందించారు. రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో ఆడి రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో మరెన్నో పథకాలు సాధించి, పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తేవాలని ఆకాక్షించారు.