Duleep Trophy : దేశవాళీ క్రికెట్ పండుగ(2025-26)కు సమయం సమీపిస్తున్న వేళ ఐపీఎల్లో విజయవంతమైన శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer)కు మరో షాక్. ప్లే ఆఫ్స్ కింగ్‌గా పేరొందిన అతడిని కాదని శార్దూల్ ఠాకూర్ (Shardhul Thakur)ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు వెస్ట్ జోన్ సెలెక్టర్లు. శుక్రవారం పేస్ ఆల్‌రౌండర్ సారథిగా దులీప్ ట్రోఫీ కోసం 15మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించారు. ఇందులో ముంబై ఆటగాళ్లే ఏడుగురు ఉండడం విశేషం.
భారత భావి కెప్టెన్‌గా కితాబులందుకున్న అయ్యర్‌కు దులీప్ ట్రోఫీలో మాత్రం చుక్కెదురైంది. ఈ మధ్యే ముగిసిన ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్లో తన నాయకత్వ పటిమతో పంజాబ్ కింగ్స్ (Punjab Kings)ను ఫైనల్ చేర్చిన అతడికి వెస్ట్ జోన్ కెప్టెన్సీ దక్కలేదు. జాతీయ జట్టకు దూరమై డొమిస్టిక్ క్రికెట్‌పైనే ఆశలు పెట్టుకున్న వెటరన్ ఆటగాళ్లు అజింక్యా రహానే, ఛతేశ్వర్ పూజారాలకు మాత్రం స్క్వాడ్‌లో చోటు దక్కలేదు.
Shardul Thakur will lead a side featuring Yashasvi Jaiswal, Shreyas Iyer, Sarfaraz Khan and Ruturaj Gaikwad
Read more ⤵️ https://t.co/Fj1jNR45rP pic.twitter.com/uX6Sf6ipnW
— ESPNcricinfo (@ESPNcricinfo) August 1, 2025
సెలెక్టర్లు ఎంపిక చేసిన స్క్వాడ్‌లో అయ్యర్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్, యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ రంజీ వీరుడు సర్ఫరాజ్ ఖాన్ కూడా ఉన్నారు. ఆగస్టు 28న బెంగళూరు వేదికగా దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది. గత సీజన్లో విజేతగా నిలిచిన సౌత్ జోన్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది.
వెస్ట్ జోన్ స్క్వాడ్ : శార్ధూల్ ఠాకూర్ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, ఆర్య దేశాయ్, హర్వీక్ దేశాయ్, శ్రేయాస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్, జైమీత్ పటేల్, మనన్ హింగ్రజియా, సౌరభ్ నవాలే, షామ్స్ ములానీ, తనుష్ కొతియాన్, ధర్మంద్రసిన్హ జడేజా, తుషార్ దేశ్‌పాండే, అర్జాన్ నగ్వసాలా.