IND vs ENG : ఓవల్ టెస్టులో ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. భోజన విరామం తర్వాత భారత బౌలర్లు పుంజుకోవడంతో జాక్ క్రాలే(64) పెవిలియన్ చేరాడు. అర్ధ శతకం తర్వాత జోరు పెంచిన క్రాలేను ప్రసిధ్ కృష్ణ వెనక్కి పంపాడు. ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న షార్ట్ బంతిని గాల్లోకి లేపిన ఓపెర్ జడ్డూ చేతికి దొరికాడు. దాంతో రెండో వికెట్ విలువైన భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం జో రూట్(4 నాటౌట్), ఓలీ పోప్(19 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు. రెండు వికెట్ల నష్టానికి 134 రన్స్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో ఇంకా 90 పరుగులు వెనకబడి ఉంది.
సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఓవల్ టెస్టులో భారత బౌలర్లు మరోసారి తేలిపోయారు. ఇంగ్లండ్ ఓపెనర్లకు కళ్లెం వేయలేక శుభారంభానికి అవకాశమిచ్చారు. టీమిండియాను 224కే ఆలౌట్ చేసిన ఆతిథ్య జట్టు మెరుపు వేగంతో తమ తొలి ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు బెన్ డకెట్ (43), జాక్ క్రాలే(48 నాటౌట్)లు బౌండరీలతో చెలరేగుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.
Prasidh Krishna gets wicket number 2⃣ for #TeamIndia! 👌👌
Ravindra Jadeja takes the catch and Zak Crawley is out for 64.
Updates ▶️ https://t.co/Tc2xpWMCJ6#ENGvIND | @prasidh43 pic.twitter.com/2x52mlymlF
— BCCI (@BCCI) August 1, 2025
డకెట్ అయితే.. స్వీప్, స్కూప్ షాట్లతో విరుచుకుపడుతూ భారత బౌలర్లను ఒత్తిడిలో పడేశాడు. కానీ, ఆకాశ్ దీప్ ఓవర్లో వికెట్ల వెనకాలకు ఆడబోయిన అతడు గురి తప్పి.. జురెల్ చేతికి దొరికిపోయాడు. అతడు ఔట్ కావడంతో దాదాపు 8 రన్ రేటుతో సాగిన ఓపెనర్ల పరుగుల వరదకు తెరపడింది. ఆ తర్వాత వెంటనే క్రాలే, పోప్లు వికెట్ ఇవ్వకపోడడంతో లంచ్ సమయానికి వికెట్ నష్టానికి 109 రన్స్ కొట్టింది ఇంగ్లండ్.