Forex Reserve | జులై 25తో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక నిల్వలు 2.703 బిలియన్లు పెరిగి 698.192 బిలియన్లకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. గత వారంలో నిల్వలు 1.183 బిలియన్లు తగ్గి 695.489 బిలియన్లకు పడిపోయాని పేర్కొంది. విదేశీ మారక ద్రవ్య ఆస్తులు 588.926 బిలియన్లకు పెరిగాయి. ఆర్బీఐ డేటా ప్రకారం.. విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ మారక ద్రవ్య ఆస్తులు 1.316 బిలియన్లు పెరిగి 588.926 బిలియన్లకు చేరుకున్నాయి. ఈ వారంలో బంగారం నిల్వలు 1.206 బిలియన్లు పెరిగి 85.704 బిలియన్లకు చేరుకున్నాయని ఆర్బీఐ తెలిపింది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDR) 126 మిలియన్ డాలర్లు పెరిగి 18.809 బిలియన్లకు చేరుకున్నాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) లో భారతదేశం రిజర్వ్ స్థానం 55 మిలియన్ డాలర్లు పెరిగి 4.753 బిలియన్ డాలర్లకు చేరుకుంది.