IND vs ENG : ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారీ స్కోర్ కొట్టిన భారత జట్టు మ్యాచ్‌పై పట్టుబిగిస్తోంది. తొలి రెండు రోజులు బ్యాటర్లు రాణించగా.. బౌలర్లు బంతితో విజృంభిస్తున్నారు. రెండో రోజు ఆఖరి సెషన్లో మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ మూడోరోజు తొలి సెషన్లో మరింత కష్టాల్లో పడింది. సిరాజ్ ఒకే ఓవర్లో డేంజరస్ జో రూట్(22), బెన్ స్టోక్స్(0)లను ఔట్ చేసి ఆతిథ్య జట్టును గట్టి దెబ్బ కొట్టాడు.
సిరాజ్ ధాటికి 84 కే ఐదు వికెట్లు పడిన వేళ.. హ్యారీ బ్రూక్(56 నాటౌట్), వికెట్ కీపర్ జేమీ స్మిత్(27 నాటౌట్)లు సమయోచితంగా ఆడుతున్నారు. ఆరో వికెట్‌కు వీళ్లు ఇప్పటికే 50 ప్లస్ భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో, ఇంగ్లండ్ స్కోర్ 130 దాటింది. అయినా ఇంకా 450 పరుగులు వెనకబడే ఉంది.
Early success on Day 3 for #TeamIndia ✅
Mohammed Siraj is on a roll here at Edgbaston! ⚡️ ⚡️
England 5 down as Joe Root & Ben Stokes depart.
Updates ▶️ https://t.co/Oxhg97g4BF#ENGvIND | @mdsirajofficial pic.twitter.com/Y41zkQfz7X
— BCCI (@BCCI) July 4, 2025
అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీని ఓటమితో ఆరంభించిన భారత జట్టు రెండో టెస్టులో ఓ రేంజ్లో ఆడుతోంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (269) చిరస్మరణీయ డబుల్ సెంచరీతో జట్టుకు కొండంత స్కోర్ అందించగా.. అతడి కష్టాన్ని బౌలర్లు వృథా చేయకుండా ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. టీ సెషన్ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్‌కు ఆకాశ్ దీప్ పెద్ద షాకిచ్చాడు. వరుస బంతుల్లో ఓపెనర్ బెన్ డకెట్(0), ఓలీ పోప్(0)లను వెనక్కి పంపి టీమిండియాకు అదిరిపోయే బ్రేకిచ్చాడు. ఆ కాసేపటికే జాక్ క్రాలే (19) క్యాచ్‌ను స్లిప్‌లో కరుణ్ నాయర్ ఒడిసిట్టుపకున్నాడు. చూస్తుండగానే మూడు వికెట్లు పడిన వేళ.. జో రూట్(22), హ్యారీ బ్రూక్‌లు వికెట్ కాచుకోవడంతో ఆతిథ్య జట్టు రెండో రోజు ఆటముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది.