Kodangal | కొడంగల్, జూలై 4 : పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధిలో భాగంగా ఇండ్లు కోల్పోతున్న ప్రతి కుటుంబానికి అన్ని సౌకర్యాలతో కూడిన ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. శుక్రవారం దేవాలయ అభివృద్ధిలో భాగంగా నిర్వాసిత కుటుంబాలకు కేటాయించే స్థలాన్ని జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కుటుంబాలకు కేటాయించిన స్థలమును రోడ్డు లేవల్కు భూమిని చదును చేసి సౌకర్యవంతమైన రోడ్లను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, తహసిల్దార్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.