అత్తా కోడళ్ల పోరు తపదా?
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ వారసత్వంపై ఆయన సోదరి, కుమార్తె మధ్య పోరాటం సాగవచ్చంటూ దక్షిణ కొరియాకు చెందిన నిఘా వ్యవస్థ నివేదిక వెల్లడించింది. కిమ్ జోంగ్ ఇటీవలి కాలంలో తన 13 ఏండ్ల కుమార్తె కిమ్ జూ ఏతో కలసి బహిరంగ వేదికలపై కనిపిస్తుండడంతో అధికార వారసత్వం ఆ బాలికకే దక్కవచ్చన్న ఊహాగానాలను రాజేసింది.
- కిమ్ వారసత్వంపై విస్తృత చర్చ
- కుమార్తె, సోదరిలో పైచేయి ఎవరిది?
సియోల్: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ వారసత్వంపై ఆయన సోదరి, కుమార్తె మధ్య పోరాటం సాగవచ్చంటూ దక్షిణ కొరియాకు చెందిన నిఘా వ్యవస్థ నివేదిక వెల్లడించింది. కిమ్ జోంగ్ ఇటీవలి కాలంలో తన 13 ఏండ్ల కుమార్తె కిమ్ జూ ఏతో కలసి బహిరంగ వేదికలపై కనిపిస్తుండడంతో అధికార వారసత్వం ఆ బాలికకే దక్కవచ్చన్న ఊహాగానాలను రాజేసింది.
అయితే కిమ్ జూ ఏకి అధికార పీఠం దక్కడం అంత సులభం కాదని దక్షిణ కొరియా మాజీ రాయబారి రా జోంగ్ ఇల్ అభిప్రాయపడ్డారు. ఆ బాలికకు పెను సవాలు తన మేనత్త కిమ్ యో యోంగ్ రూపంలో ఎదురు కావచ్చని ఆయన చెప్పారు. తన సోదరుడి లాగే ఆమె కూడా అత్యంత క్రూరమైన వ్యక్తిగా పేరు సంపాదించుకుంది.
38 ఏండ్ల కిమ్ యో జోంగ్ ఉత్తర కొరియాలో తన అన్న తర్వాత అత్యంత శక్తివంతమైన వ్యక్తి. పార్టీపైన, సైన్యంపైన ఆమెకు మంచి పట్టు ఉంది. పార్టీకి చెందిన 250 మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో అధ్యక్షుడిని తప్ప ఎవరికైనా మరణశిక్షలు విధించగల శక్తి ఆమెకు ఉన్నట్లు తెలుస్తున్నది. కిమ్ యో జోంగ్ అధికార పీఠాన్ని వదులుకోబోరని నిపుణుల అభిప్రాయం. దేశాధినేత్రిగా తనకు అవకాశం ఉన్నట్లు ఆమె భావిస్తే ఆమె ఏమాత్రం వెనుకాడబోదని, దీన్ని బట్టి అధికారం కోసం పోరాటం అనివార్యమని భావించాలని రే జోంగ్ ఇల్ చెప్పారు. కిమ్ జోంగ్ ఉన్‌కు ఏదైనా జరగరానిది జరిగి ఆయన పాలించలేని పరిస్థితి వస్తే వెంటనే కిమ్ యో యోంగ్ అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నించవచ్చని ఆయన చెప్పారు.
స్వీట్ ప్రిన్సెస్ యో జోంగ్
చిన్నతనంలో కిమ్ యో జోంగ్‌ను స్వీట్ ప్రిన్సెస్‌గా పిలిచేవారు. 2014 నుంచి ఆమె ఉత్తర కొరియాలో ప్రభుత్వ సిద్ధాంతాలను ప్రచారం చేసే ప్రచార, ఉద్యమ శాఖ(పీఏడీ) చైర్‌పర్సన్‌గా ఉన్నారు. బాల్యం నుంచి కిమ్ జోంగ్ ఇల్ వద్ద వంటవాడిగా పనిచేసిన ఫుజీమోటో కథనం ప్రకారం చిన్నతనం నుంచి కిమ్ యో జోంగ్ చాలా బలమైన వ్యక్తిత్వం గల వ్యక్తి. ఆమెను యువరాణిగా పిలిచేవారు.
2021లో కిమ్ యో జోంగ్కు ప్రభుత్వ వ్యవహారాల కమిషన్‌లో స్థానం లభించింది. 2023 జనవరిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఉత్తర కొరియా ప్రధాన అధికార ప్రతినిధిగా ఆమె వ్యవహరించారు. కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిత్వాన్ని, ప్రతిష్టను దేశీయంగా, అంతర్జాతీయంగా తీర్చిదిద్దడంలో ఆయన సోదరి కిమ్ యో జోంగ్ది ప్రధాన పాత్రని నిపుణులు విశ్వసిస్తారు. తన సోదరుడికి అనేక ముఖ్యమైన విషయాల్లో ఆమె సలహాలు ఇస్తారని నిపుణులు భావిస్తున్నారు.
కుమార్తెకు రాజకీయ శిక్షణ
కాగా, కిమ్ కుమార్త్తె కిమ్ జూ ఏకు ప్రస్తుతం 13 ఏండ్లు మాత్రమే. ఇటీవలి కాలంలో క్షిపణి పరీక్షలు, సైనిక కవాతులు, ప్రభుత్వ వేడుకల్లో తన తండ్రి వెంట ఆమె తరచుగా కనిపిస్తున్నది. భవిష్యత్తు బాధ్యతల కోసం ఆమెను తీర్చిదిద్దుతున్నారని, ఇదంతా తర్ఫీదులో భాగమేనని సమాచారం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

