నర్సాపూర్, ఫిబ్రవరి 16 : మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అనైతిక పొత్తుతో పదవులు దక్కించుకున్నాయని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో సోమవా రం ఆమె విలేకరులతో మాట్లాడారు. నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గందరగోళ పరిస్థితిని సృష్టించాయన్నారు. రాష్ట్రంలో బడే బాయ్ చోటే బాయ్ అనే మాట నేటి మున్సిపల్ ఎన్నికల్లో కాం గ్రెస్, బీజేపీ పొత్తుతో తేటతెల్లమైందన్నారు.
బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటేనని మాట్లా డే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎవరు ఏమిటో నేడు ప్రజలకు తేలిపోయిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల అనైతిక పొత్తును ప్రజలు హర్షించరని ఎద్దేవా చేశారు. నేడు నర్సాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ, కాంగ్రెస్ అనైతిక పొత్తుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. ఓ ఎమ్మెల్యేగా గెలుపొందిన చైర్ పర్సన్, వైస్ చైర్మన్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నర్సాపూర్ పట్టణ అభివృద్ధి కోసం తప్పకుండా నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. విజయా లు, అపజయాలు సహజమేనని, కానీ ఇలాం టి పొత్తు సరైనది కాదని వెల్లడించారు. అనంతరం బీఆర్ఎస్ కౌన్సిలర్లను ఆమె అభినందించారు. ఎమ్మెల్యేతో పాటు కౌన్సిలర్లు సునీతాబాల్‌రెడ్డి, లలితాభిక్షపతి, కండెల రాజు, సమీనాబేగం, మోహిజుద్దీన్ ఉన్నారు.