IND vs ENG : భారత పేసర్ మహ్మద్ సిరాజ్ (2-10) లార్డ్స్ మైదానంలో నిప్పులు చెరుగుతున్నాడు. తొలి సెషన్ ఆరంభంలోనే ఇంగ్లండ్‌ను దెబ్బ కొట్టిన ఈ స్పీడ్‌స్టర్ మరోసారి ఆతిథ్య జట్టుకు తన పేస్ పవర్ చూపించాడు. ఓలీ పోప్(4)ను ఎల్బీగా వెనక్కి పంపాడు. అంపైర్ ఔట్ ఇవ్వకపోవడంతో రివ్యూ తీసుకొని మరీ వికెట్ సాధించింది టీమిండియా. దాంతో, 42 పరుగుల వద్ద స్టోక్స్ సేన రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో ఉన్న జాక్ క్రాలే (22), జో రూట్(1)లు భాగస్వామ్యం నెలకొల్పి జట్టను ఆదుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికీ ఇంగ్లండ్ 48 పరుగుల ఆధిక్యంలో ఉంది.
అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్(2-10) హడలెత్తిస్తున్నాడు. నాలుగో రోజు తొలి సెషన్లో గేర్ మార్చాలనుకున్న బెన్ డకెట్(12)ను ఔట్ చేశాడు సిరాజ్. గ్రౌండ్ షాట్ ఆడబోయిన డకెట్ మిడాన్‌లో బుమ్రా చేతికి చిక్కాడు. అంతే.. 22 వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత జాక్ క్రాలే (22), ఓలీ పోప్(4)లు ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. కానీ, పోప్‌ను ఎల్బీగా వెనక్కి పంపి ఇంగ్లండ్‌ను గట్టి దెబ్బకొట్టాడీ మియా భాయ్.