Pahalgam Attack : కశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిని(Terror Attack) యావత్ ప్రపంచం ఖండిస్తోంది. పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ముష్కరులను వదిలేయొద్దని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత క్రికెటర్లు పలువురు ఇప్పటికే ఎక్స్ వేదికగా పహల్గామ్ దాడిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పోస్ట్‌లు పెట్టారు. పేసర్ మహ్మద్ సిరాజ్(Mohammad Siraj) సైతం తన ఆవేదనను పంచుకున్నాడు. ఇది అసలు ఏరకమైన యుద్ధం. మనుషుల ప్రాణాలకు విలువన్నదే లేకుండా పోయింది అంటూ స్పీడ్‌స్టర్ తన ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
‘పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన భయంకరమైన దాడి గురించి తెలిసి షాకయ్యాను. మతం పేరుతో అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం, వాళ్లను చంపడం అనేది హేయమైన చర్య. ఇలాంటి క్రూరమైన చర్యలను ఏ సిద్ధాంతమూ అంగీకరంచదు. ఇది ఏ రకమైన యుద్ధం. మనుషుల ప్రాణాలకు ఎలాంటి విలువ లేకుండా పోతోంది. పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల్లో నిండిన విషాదం.. వాళ్లు పడుతున్న బాధను నేను ఊహించలేకపోతున్నాను’ అని సిరాజ్ తన ఆక్రోషాన్ని, ఆవేదనను వెల్లగక్కాడు.
Just read about the horrific and shocking terrorist attack in Pahalgam.
To target and kill innocent civilians in the name of religion is pure evil…
No cause, no belief, no ideology can ever justify such a monstrous act.Yeh kaisi ladai hai… pic.twitter.com/nP5LKpT94E— Mohammed Siraj (@mdsirajofficial) April 23, 2025
పెహల్గామ్ ఉగ్రదాడిలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు టీమిండియా క్రికెటర్లు సంతాపం తెలియజేస్తున్నారు. మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్లు దాడిని ఖండిస్తూ ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు. పెహల్గామ్ దాడి గురించి వింటే గుండె తరుక్కుపోతోందని, బాధిత కుటుంబాల పట్ల సానుభూతి ప్రకటిస్తున్నామని, ఈ దేశంలో ఇలాంటి హింసకు చోటు లేదు అని శుభమన్ గిల్ తన పోస్టులో పేర్కొన్నాడు.
Heartbreaking to hear about the attack in Pahalgam. My prayers are with the victims and their families. Violence like this has no place in our country.
— Shubman Gill (@ShubmanGill) April 22, 2025
కశ్మీర్ ఉగ్రదాడిని ఖండిస్తున్నానని, బాధిత కుటుంబాలు తేరుకోవాలని ఆశిస్తున్నట్లు రాహుల్ తెలిపాడు. స్పృహ లేని హింసకు అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, బాధిత కుటుంబ సభ్యుల తరపున ప్రార్థిస్తున్నట్లు అనిల్ కుంబ్లే తెలిపారు. ఉగ్రదాడిలో మరణించిన వాళ్లకు సంతాపంగా సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ సంద్భంగా ఆటగాళ్లు భుజాలకు నల్లరిబ్బన్ల(Black Ribbon)తో బరిలోకి దిగనున్నారు.